Moviesఏ సినిమా అయినా సరే ..హీరోయిన్ తో అలా చేయాల్సిందే..వరుణ్ పై...

ఏ సినిమా అయినా సరే ..హీరోయిన్ తో అలా చేయాల్సిందే..వరుణ్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

సెంటిమెంట్ ఫాలో అవ్వని మనిషంటూ ఉండడు . ప్రతి మనిషికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఎవరో మూర్ఖులు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. మేము సెంటిమెంట్ ఫాలో అవ్వము అని పైకి చెప్పుకున్నా ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ గా సెంటిమెంట్ ఫాలో అవుతారు. అంతెందుకు ఈ ఆర్టికల్ చదివే మీలో చాలామంది కూడా అలా ఫాలో అవుతూ ఉంటారుగా. వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే కూర్చొని వెళ్లాలని ..ఎదురుగా పిల్లి వస్తే మంచి నీళ్లు తాగి వెళ్లాలని.. నక్క తోక తొక్కితే అదృష్టం అని.. బల్లి పడితే అపశకునమని.. దీపం పెట్టేటప్పుడు గాలికి దీపం ఆరిపోయిన సరే ఏదో జరగరానిది జరగబోతుంది .. ప్రళయం రాబోతుంది అంటూ హంగామా చేసే జనాలు మనలో చాలామంది ఉంటారు.

అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ కూడా కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతారు.. మనలాగా కుక్క ఎదురొచ్చినా పిల్లి ఎదురొచ్చిన అపశకునం అనుకునే సెంటిమెంట్లు కాదండి.. తన సినిమాలో కచ్చితంగా ఏదైనా సరే సీన్ లండన్ కి వెళ్లి షూట్ చేస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనేది ఆయన ఓ నమ్మకమట . పాపం కొన్ని సినిమాలకు ఈ సెంటిమెంట్ మిస్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాడట .ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. అంతేకాదు ఈ విషయాన్ని స్వయాన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చెప్పి షాక్ ఇచ్చాడు. మనకు తెలిసిందే ప్రజెంట్ ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ సినిమా కమిట్ అయిన సంగతి త్వరలోనే ఈ సినిమా లండన్ లో షూటింగ్ జరుపుకోబోతుంది.


దీనిపై ప్రవీణ్ సత్తార్ స్పందిస్తూ..” వరుణ్ తేజ్ కు ఓ సెంటిమెంట్ ఉంది తాను నటించిన సినిమాలలో ఏదైనా సరే కొన్ని సీన్స్ విదేశాలలో షూటింగ్ చేయాలి. అది కూడా కచ్చితంగా విదేశాలలో షూటింగ్ చేస్తే ఆయన సినిమా హిట్ అవుద్ది అనేది ఆయన ఓ సెంటిమెంట్ .అందుకే ఈ సినిమాలో విదేశాలలో షూటింగ్ జరిగే సీన్స్ రాసుకోకపోయినా సరే ..ఆయన ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని తెలిసి ప్రత్యేకంగా కొన్ని సీన్స్ ని యాడ్ చేసి ఆయన కోసమే సినిమా షూటింగ్ లండన్ లో షూట్ చేయబోతున్నాం” అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు. అంతే దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో దూసుకెళ్లిపోయింది. అంతేకాదు వరుణ్ తేజ్ నటించిన ప్రతి సినిమాలో కచ్చితంగా హీరోయిన్ కారణంగా హీరో బాధపడాల్సిందే. అలా ఉంటేనే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ఇప్పటివరకు వరుణ్ తేజ్ నటించిన హిట్ అయిన సినిమాలలో ప్రతి సినిమాలలో అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ వచ్చాడు వరుణ్ తేజ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news