సినిమా హీరోలు అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు హీరోలు అంటే ప్రాణం ఇస్తారు. తమకు కాబోయే వరుడు ఆ హీరోలా ఉండాలి… ఈ హీరోలా ఉండాలని కలలు కంటూ ఉంటారు. అలాంటిది హీరోల పక్కన జోడిగా నటించే హీరోయిన్లు మాత్రం ఆ ఛాన్స్ వస్తే వదులుకుంటారా. ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమ్రతను వివాహం చేసుకున్నారు. వీరి సంసారం సాఫీగా సాగుతోంది.
అంతేకాకుండా నాగచైతన్య సమంతను వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా ఇప్పుడు హీరోయిన్ మంజిమా మోహన్ కూడా తమిళ హీరో తో ఎఫైర్ నడిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మాంజిమా మోహన్ టాలీవుడ్ కు పరిచయమైంది.
ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయినప్పటికీ మంజిమ మోహన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. కానీ ఆశించిన మేర ఆఫర్లను అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే మంజిమా ప్రస్తుతం కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పటి స్టార్ హీరో కార్తీక్ కుమారుడే గౌతమ్ కార్తీక్… ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలతో గౌతమ్ కార్తీక్ కోలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
కొంతకాలంగా గౌతమ్ కార్తీక్ మంజిమ మోహన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా గౌతమ్ కార్తీక్ తో ఈ హీరోయిన్ డేటింగ్ చేస్తుందని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరూ మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ..తాను ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు.
అయితే పెళ్లికూతురు ఎవరు అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. మరోవైపు మంజిమ మోహన్ కూడా ఈ రూమర్స్ పై ఇప్పటి వరకూ స్పందించలేదు. దాంతో గౌతమ్ కార్తీక్ మంచి మాంజిమా మోహన్ ని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.