సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎన్ని తప్పులు చేసినా ఇబ్బంది ఉండదు. వాళ్ల కెరియర్ కు ఎలాంటి ఢోకా ఉండదు. అదే హీరోయిన్ ఎవరో ఒకరిని గుడ్డిగా నమ్మేసి చిన్న రాంగ్ స్టెప్ వేస్తే చాలు.. వాళ్ళ కెరియర్ సర్వనాశనం అయిపోతుంది. అప్పటివరకు ఉన్న క్రేజ్ అంతా పాతాళంలో పడిపోతుంది. ఇందుకు ఉదాహరణ మహానటి సావిత్రి. ఒక్క సావిత్రి మాత్రమే కాదు.. ఆ తరంలో ఎందరో క్రేజీ హీరోయిన్లు తాము చేసిన చిన్న చిన్న తప్పులతో పాతాళంలో పడిపోయి కెరీర్ నాశనం చేసుకున్న వారు ఉన్నారు. ఈ లిస్టులోకే ఒకప్పటి హీరోయిన్ శ్రీవిద్య కూడా వస్తారు. శ్రీవిద్యది కర్ణాటకలోని సంగీత విద్వాంసుల కుటుంబం.
శ్రీవిద్య తండ్రి తాగుబోతు కావడంతో పాటు కుటుంబాన్ని పట్టించుకునే వాడు కాదట. అయితే శ్రీవిద్య తల్లి మాత్రం సంగీత విద్వాంసరాలు. కుటుంబం కోసం శ్రీవిద్యను చిన్న వయసులోనే సినిమాల్లోకి వెళ్లేలా ప్రోత్సహించారు. అందంతో పాటు అభినయం కూడా ఉండడంతో శ్రీవిద్య తమిళంలో హిట్ సినిమాల్లో నటించింది. కెరీర్ ప్రారంభంలోనే కమలహాసన్‌తో ఆమె ప్రేమలో పడింది. ఇంకా చెప్పాలంటే కమల్ సిన్సియర్‌గా శ్రీవిద్యను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు.. శ్రీవిద్య కూడా కమల్‌ప్రేమలో పడిపోయింది.
శ్రీవిద్య తల్లికి కూడా ఈ పెళ్లి ఇష్టమే. అయితే కమలహాసన్ కుటుంబం నుంచి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. నీకు అప్పుడే పెళ్లి ఎందుకు ? తాట తీస్తాం అని వార్నింగ్ ఇవ్వడంతో కమల్ శ్రీవిద్యకు బ్రేకప్ చెప్పేసాడు. కమల్‌తో బ్రేకప్ అయ్యాక శ్రీవిద్య తెలుగు.. తమిళ సినిమాలు తగ్గించేసి మలయాళ సినిమాల వైపు బాగా ఫోకస్ చేసింది. ఆ సమయంలో కుమార సంభవం అనే సినిమాతో ఆమెకు అక్కడ మంచి బ్రేకప్ వచ్చింది. ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్ థామస్‌తో మళ్లీ శ్రీవిద్య ప్రేమలో పడింది.
అలా జార్జ్ థామస్‌ను శ్రీవిద్య పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి అయిన ఏడాది నుంచే ఆమెకు భర్త నుంచి వేధింపులు తప్పలేదు. శ్రీవిద్యను కేవలం తన జల్సాల కోసం డబ్బులు సంపాదించే యంత్రంగానే జార్జ్ థామస్ చూడడంతో మూడేళ్లకే శ్రీవిద్య అతనికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా పాపులర్ అయిన డైరెక్టర్ భరతన్‌తో మళ్లీ ప్రేమలో పడింది. భరత్ అను కూడా మూడేళ్లు సహజీవనం చేశాక శ్రీవిద్యను వదిలించుకున్నాడు. అలా జీవితంలో మూడుసార్లు ప్రేమించి.. మూడుసార్లు మోసపోయిన శ్రీవిద్య కెరీర్ చివరి దశలో ఆధ్యాత్మికంలోకి వెళ్లిపోయింది.
చివర్లో ఆమె స్పైనల్ కార్డ్ క్యాన్సర్ తో బాధపడింది. అయితే చివర్లో మాత్రం తన ఆస్తిని తన ఇంటిని సంగీత పాఠశాలకు ఉపయోగించుకోవాలని… పేద పిల్లలకు సంగీతం నేర్పేందుకు ప్రత్యేకంగా ఒక టీచర్‌ను నియమించాలని కోరుకుంది. ఆమె కోరిక మేరకు ఆమె మరణాంతరం అలాగే చేశారు. 2006లో శ్రీవిద్య మృతి చెందారు. ఇప్పటికీ తిరుపనంతపురంలో శ్రీ విద్య ఇంట్లో ఆ సంగీత పాఠశాల నడుపుతున్నారు.