Moviesమంచు విష్ణు సంచ‌ల‌న నిర్ణయం.. మా నుంచి వాళ్లు స‌స్పెండ్‌..!

మంచు విష్ణు సంచ‌ల‌న నిర్ణయం.. మా నుంచి వాళ్లు స‌స్పెండ్‌..!

గత ఏడాది అక్టోబర్లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలను మించి తలపించాయి. ఇటు మంచి విష్ణు ఫ్యానల్, అటు మెగాస్టార్ చిరంజీవి.. మెగా కాంపౌండ్ సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. హోరాహూరిగా జరిగిన ఈ ఎన్నికల్లో రెండు వర్గాలకు చెందినవారు ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో చివరకు మంచి విష్ణు విజయం సాధించారు. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది గడిచింది. ఈ క్రమంలోనే విష్ణు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అలాగే కొన్ని వార్నింగులు కూడా విష్ణు ఇచ్చారు. ఇకపై రెండు సినిమాల్లో నటించి అవి రిలీజ్ అయితేనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని.. అలాగే ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించి డైలాగ్స్ చెప్పిన వారికి మాత్రమే అసోసియేట్ గా సభ్యత్వం కల్పిస్తామని చెప్పుకు వచ్చారు. అయితే అసోసియేట్ సభ్యులుగా ఉన్నవారికి మాలో ఓటు హక్కు ఉండదని కూడా విష్ణు బాంబు పేల్చారు. విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే మాలో ఉన్న మెగా కాంపౌండ్ కు చెందిన కొందరిపై వేటు వేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతుంది.

వాస్తవానికి గతంలో మెగా క్యాంపున‌కు చెందిన సురేష్ కొండేటి పై విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. సురేష్ కొండేటి ఒక జర్నలిస్ట్ అని.. జర్నలిస్టు అయిన వ్యక్తి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోకి ఎలా ?వచ్చాడని కూడా విష్ణు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఒక్క డబ్బింగ్ సినిమా కొని అందులో ఒక పాటలో నటించినంత‌ మాత్రాన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు అయిపోతారా ? అని విష్ణు ఘాటుగా ఆరోపణలు చేశారు. అయితే సురేష్ కొండేటి అప్పట్లో ప్రకాష్ రాజు ప్యానెల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు అందరూ రాజీనామా చేయడంతో సురేష్ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తాజా సమావేశంలో మంచి విష్ణు మాట్లాడుతూ మాకు వ్యతిరేకంగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారు సభ్యులుగా ఉండటానికి అనర్హులు అవుతారని… ఈ విషయాన్ని తాము క్రమశిక్షణ సంఘం ముందు పెట్టి వారిపై వేటు వేస్తామని విష్ణు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అసోసియేషన్ లో 20 శాతం మంది నటులు కాని వారు కూడా సభ్యులుగా ఉన్నారని.. విష్ణు చెప్పటాన్ని బట్టి చూస్తే వాళ్లలో మెగా కాంపౌండ్‌కు చెందిన వారిని సభ్యులుగా తప్పించే అవకాశాలే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

గతంలో నాగబాబు మంచు విష్ణుతో పాటు మాను టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు. ఇప్పుడు మంచి విష్ణు చేసిన కామెంట్ చూస్తే నాగబాబును కూడా మా నుంచి తొలగించబోతున్నారా ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇక గతంలో ఒక హీరో డబ్బులు ఇచ్చి మరి తనపై కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నాడని విష్ణు ఆరోపించిన సంగతి తెలిసిందే. విష్ణు ఈ వ్యాఖ్యలు నేరుగా చిరంజీవిని ఉద్దేశించే అన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. మాలో మెగా కాంపౌండ్ కు చెందిన వారిపై రకరకాల కారణాలతో వేటు వేసే అవకాశం ఉందనే అంటున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news