Moviesఊరికే ఎందుకు చూపిస్తాం.. ఎవరికి ఎక్కడ చూపించాలో మాకు తెలియదా..?

ఊరికే ఎందుకు చూపిస్తాం.. ఎవరికి ఎక్కడ చూపించాలో మాకు తెలియదా..?

కల్పిక గణేష్ .. ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . టాలీవుడ్ , బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ట్రెడిషనల్ లుక్ తో మోడ్రన్ మాటలతో జనాలను ఆకట్టుకుంటుంది . కాగా హీరోయిన్ కి ఫ్రెండ్ గా, హీరోకి చెల్లిగా మారి సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న గణేష్ కల్పిక ..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.

తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పై ఫైర్ అవుతూ.. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ భీష్మించుకుని కూర్చుంది . తర్వాత కొందరు పెద్ద మనుషుల సలహాలతో ఇద్దరు సద్దుమణిగిపోయినా.. రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్యకాలంలో తనపై వస్తున్న ట్రోల్స్ కి ఘాటుగా జవాబు ఇచ్చింది గణేష్ కల్పిక . ఆమె మాట్లాడుతూ ..”అందరూ పదేపదే స్కిన్ షో చేస్తున్నామంటారు.. దాన్ని పట్టుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు.. మేము ఏమి ఊరికే జబ్బలు చూపించడం లేదు.. స్కిన్ షో చేయడం లేదు ..ఎవరికి చూపించాలో ఎవరికీ చూపించకూడదో మాకు బాగా తెలుసు” అంటూ తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది కల్పిక .

దీంతో ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ప్రజెంట్ కల్పిక పలు తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. మంచి ఫిజిక్ చూడగానే ఆకట్టుకునే అందంతో అలరిస్తున్న కల్పిక హీరోయిన్ అవదామని ఇండస్ట్రీకి వచ్చిందట . కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరిపెట్టుకున్నింది. చూడాలి ముందు ముందు అమ్మడు ఎలాంటి పాత్రలో మెప్పిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news