ప్రముఖ నటి వాణిశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ రంగాన్ని ఏలిన వారిలో అనేక మంది హీరోయిన్లు ఉన్నా.. విభిన్న పాత్రల్లో మెప్పించిన వాణిశ్రీ పేరు తెలుగు నాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఒక్క తెలుగులోనే కాకుండా.. వాణిశ్రీ తమిళంలోనూ ఫేమస్ అయ్యారు. సినీ రంగం వరకు వాణిశ్రీ ఒకానొక దశకంలో ఇతర స్టార్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ కూడా ఇచ్చారు. ఇతర హీరోయిన్లకు సైతం ఆమె కంట్లో నలుసులా మారిన సందర్భాలు ఉన్నాయి.
తర్వాత.. కాలంలో కొందరు హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, వాణి శ్రీ మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాలంటే.. ఏముంది.. ఒకరినొకరు తిట్టుకోవడమే కదా.. అధికారం ఐదేళ్లకోసం..పరువును పోగొట్టుకుని రొడ్డున పడడం ఎందుకులే అనే మనస్తత్వంతో వాణిశ్రీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇదే.. ఆమెను అనేక వివాదాల్లోకి నెట్టింది. ముఖ్యంగా తమిళనాడును సుదీర్ఘ కాలం పాలించిన జయలలితతో వివాదాన్ని సృష్టించింది.
జయలలిత.. వాణిశ్రీ చాలామంచి స్నేహితులు. పలు తమిళ సినిమాల్లో కలిసి నటించారు కూడా.
ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. జయలలిత .. తనకు సహాయంగా రాజకీయాల్లోకి రావాలని.. వాణిశ్రీని కోరారు. అయితే.. ఆమె దీనిని సున్నితంగా తిరస్కరించారు. కానీ, జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. ఆమె తలుచుకున్నది జరగకపోతే.. పంతం పట్టే నాయకురాలు. ఇదే పంతం.. ఆమె స్నేహితురాలైన.. వాణిశ్రీపైనా పట్టారు.
ఈ క్రమంలో ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత.. సొంత పార్టీ ఏఐఏడీఎంకే.. నాయకుడు.. ఒకరు వాణిశ్రీకి మద్రాసు శివారులో ఉన్న ఒక ఫాం హౌస్‌ను ఆక్రమించుకున్నారు. దీనిపై వాణిశ్రీ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. తన స్థలం ఆక్రమించుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ, జయలలిత మాత్రం పట్టించుకోలేదు.
పాత సంగతులు మనసులో పెట్టుకున్నారో.. లేక వాణిశ్రీ తన మాట వినలేదనే అలకపోలేదో.. తెలియదు కానీ.. జయలలిత వాణిశ్రీకి న్యాయం చేయలేదు. తర్వాత.. వచ్చిన ప్రభుత్వాలు.. కూడా.. అమ్మ మాటను జవదాటలేదు. దీంతో వాణిశ్రీ 30 సంవత్సరాలకుపైగానే తన భూమి కోసం ఎదురు చూశారు. ఇటీవల సీఎం స్టాలిన్.. ఆ భూమి వివాదాన్ని పరిష్కరించి.. వాణిశ్రీకి న్యాయం చేశారు. ఇదీ.. జయలలిత పంతం అంటే..!!