ఒక భాషలో సక్సెస్ సాధించిన హీరోయిన్ మరో భాషలో సక్సెస్ సాధించడం చాలా కష్టం. అలా అని అందరి విషయంలోనూ జరగదు. సౌందర్య లాంటి అగ్ర కథానాయిక సౌత్ భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. ఇప్పుడున్న పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వారు అంతే. ఒక సినిమా భారీ హిట్ అందుకుంటే చాలు.. వెంటనే మిగతా భాషలలో అవకాశాల కోసం ఆవురావురంటూ చూస్తున్నారు. అయితే, ఇలాంటి వారిని ఇండస్ట్రీలలో వాడుకునేవారు లేకపోలేదు.
దీనికి ఉదాహరణ ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాలో హీరోతో కలిసి ముద్దుల వర్షం కురిపించింది. సినిమా భారీ హిట్. దాంతో అందరూ ఆ తరహా పాత్రలనే ఆఫర్ చేశారు. అంతేకాదు, పాయల్‌కి చెప్పిన 70, 80 కథలలో అన్నీ ఆర్ ఎక్స్ 100 తరహా మూవీ లాంటివే. అదీకాక కొందరు తప్పనిసరిగా కమిట్‌మెంట్ ఇవ్వాలని పట్టుపట్టారట. ఇన్‌డైరెక్ట్‌గా పాయల్ ఈ విషయాన్ని కూడా ఓ సందర్భంలో వెల్లడించింది. ఆ తర్వాతే తనకి ఆశించిన సినిమా అవకాశాలు రాలేదు.
హీరోయిన్ ఎప్పుడు కూడా మేకర్స్ ఎంత వాడుకున్నా మంచోళ్ళే అని చెప్పాలి. లేదంటే తొక్కేస్తారు. వాడిన విషయాన్ని కూడా మార్చి గౌరవస్తులు అనేట్టుగా పబ్లిక్‌లో చెప్పాలి. లేదంటే హీరోయిన్ కనుమరుగైపోతుంది. ఇలా గతంలో అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ రచన బెనర్జీ. రచన తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలు. కానీ, కన్నడలో దాదాపు 50కి పైగా సినిమాలు చేసింది.
వాటిలో 40 సినిమాలకి పైగా సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించడం విశేషం. అలా ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు పుచ్చుకున్నారు. అయితే, రచన లాంటి అందగత్తె తెలుగులో కమర్షియల్ హీరోయిన్‌గా నిలబడే అవకాశాలున్నాయి. ఎందుకంటే గ్లామర్ పాత్రలు చేసి ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా బావగారు బాగున్నారా సినిమాలో కూడా నటించింది.
కానీ, ఇక్కడ కొందరి హింస భరించలేక, దర్శక నిర్మాతలు అడిగిన కమిట్మెంట్లు ఇవ్వలేక తెలుగులో ఎక్కువ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. మనవాళ్ళకి ఎక్కువగా కొన్ని విషయాలలో సపోర్ట్ చేయాలి.. వాళ్లు చెప్పిందల్లా చేయాలి.. లేదంటే సైడ్ చేస్తారు. అదే రచన విషయంలోనూ జరిగిందని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.