రష్మిక మందన్న..ఈ బెంగుళూరు భామ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకొని ఖాళీ లేకుండా భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత గన రష్మిక పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎక్కడుండేదో ఎవరికీ తెలియదు. కానీ, సినీ కెరీర్ ఈ రేంజ్లో ఉంటుందని ఎవరైనా చెప్పారో లేక తనే ఊహించిందో గానీ ఏకంగా నిశ్చితార్థం కూడా రద్దు చేసుకుంది. ఇలా చేయడానికి చాలా ధైర్యం కావాలి. పెళ్లి తర్వాత సఖ్యత కుదరక విడాకులు తీసుకున్నవారున్నారు.
కానీ, ఎంగేజ్మెంట్ అయ్యాక తన లైఫ్ ఎలా ఉంటుందో ఓ అంచనాకి వచ్చి రద్దు చేసుకున్నవారు మాత్రం వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. తాను తీసుకున్న ఈ నిర్ణయం బాగా కలిసి వచ్చింది. తన మాతృభాష కన్నడ కంటే తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగుతుండటం అది కూడా పాన్ ఇండియా హీరోయిన్గా అనేది చాలా గొప్ప విషయం. కేవలం తెలుగు, తమిళ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ చెలరేగిపోతుంది.
అయితే, మన హీరోలకంటే కూడా హీరోయిన్స్ విషయంలో మేకర్స్ ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ కాస్ట్యూమ్స్, మేకోవర్ విషయంలో అధికంగా బడ్జెట్ కేటాయించిన, కేటాయిస్తున్న నిర్మాతలు చాలామంది ఉన్నారు. వీఎఫెక్స్ వర్క్‌తో సాధారణంగా అనిపించే హీరోయిన్ను కూడా అద్భుతంగా చూపిస్తున్నారు. అంతేకాదు, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా తెరమీద చూపిస్తున్నారు.
ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకుంది రష్మిక మందన్న. ఈ సినిమాలో మైండ్ బ్లాక్ అనే సాంగ్ కోసం బాగానే ఖర్చు చేశారట. ఈ పాటలో రష్మిక పొట్ట భాగం బాగా ఎత్తుగా కనిపించిందట. దాన్ని అందంగా చూపించేందుకు రష్మిక బొడ్డు క్యూట్‌గా చూపించేందుకు దాదాపు రు. 30 లక్షల వరకు ఖర్చు చేశారట.
కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడం వల్ల ఈ 30 ముప్పై లక్షలు ఖర్చైందని సమాచారం. మన మాస్ ఆడియన్స్ ఎక్కువగా హీరోయిన్స్ నాభి అందాలను ఇష్టపడతారు. అందుకే, రష్మిక బొడ్డు బాగా చూపించేందుకే ఇంతగా ఖర్చు చేశారట. డైట్ చేసి నేచురల్‌గా తగ్గేంత సమయం లేకనే ఇలా చేశారని చెప్పుకుంటుంటారు. ఈ సాంగ్ సినిమాకు చాలా హైలెట్ అయింది.