అదేదో సినిమాలో చెప్పినట్లు ఎప్పుడొచ్చామా అన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ . ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చామా అన్నది కాదు ..పాపులారిటీ దక్కించుకున్నామా ఆస్తిని వెనకేసుకున్నామా ఇదే ట్రెండ్ ఇప్పుడు వెండితెరపై బుల్లితెరపై నడుస్తుంది . ఈ క్రమంలోనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న పాత సామెతను మన స్టార్స్ ఎక్కువగా ఫాలో అవుతూ.. పాపులారిటీ ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి మరి ఆస్తులను వెనకేసుకుంటున్నారు . ఆ లిస్టులో ముందు వరుసలో ఉన్నాడు హైపర్ ఆది.
ఈ పేరుకు ప్రత్యేకించి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తన వల్గర్ డైలాగ్స్ తో డబుల్ మీనింగ్ పంచస్ తో ఎప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాడు ఈ జబర్దస్త్ కమెడియన్. హైపర్ ఆది అనే పేరు ఒకప్పుడు ఎవరికి తెలియదు . జబర్దస్త్ షో పుణ్యమాంటూ ఫామ్ లోకి వచ్చాడు ఈ మల్టీ టాలెంటెడ్ కమెడియన్ . నిజానికి మొదట్లో హైపర్ ఆది స్కిట్స్ చాలా కూల్ గా నవ్విస్తూ ఉండేటివి. కానీ రాను రాను ఆయన ట్రాక్ మొత్తం ఆడవాళ్ళపై యంగ్ బ్యూటీస్ పై డబుల్ మీనింగ్ పంచెస్ వేయడంపై మారిపోయాయి. ఈ క్రమంలోని హైపర్ ఆది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతూ వచ్చింది.
ఈ క్రమంలోనే హైపర్ ఆది ఇండస్ట్రీలోకి వచ్చి ఎంత ఆస్తిని సంపాదించుకున్నాడు అనే న్యూస్ వైరల్ గా మారింది . హైపర్ ఆది ఇండస్ట్రీకి రాకముందు తనకి ఒక సొంత ఇల్లు చిన్నది ఉండేదట . కానీ ఇప్పుడు హైపర్ ఆది ఇండస్ట్రీకి వచ్చాక తన టోటల్ ఆస్తి సుమారు 50 కోట్ల పైనే అంటున్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్య హైదరాబాద్లో కొనుగోలు చేసిన ఇంటి ఖరీదే దాదాపు 10 కోట్లు ఉంటుందని ..ఇదే కాకుండా హైపర్ ఆది ఒక్క ఎపిసోడ్ కి 70 వేలు చార్జ్ చేస్తున్నాడు అని తెలుస్తుంది . ఈ రేంజ్ లో డిమాండ్ చేసిన ఏకైక జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదినే. దీంతో ఒక్కసారి జబర్దస్త్ కామెడీయన్స్ షాక్ అయిపోతున్నారు . హైపర్ ఆది ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఆస్తి వెనకేసుకున్నాడా గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు.