హీరోయిన్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియాలో పాపులర్ నటీమణి సరిత. సరిత అసలు పేరు అభిలాష. ఈమె గుంటూరు లోనే పుట్టి అక్కడే పెరిగింది. తమిళ్, కన్నడ, మలయాళం మరియు తెలుగు సినిమాల్లో 500 లకు పైగా సినిమాల్లో నటించిన తక్కువ మంది హీరోయిన్స్ లో ఆమె కూడా ఒకరు. 1980 వ దశకంలో హీరోయిన్ గా ఫుల్ బిజీ గా ఉన్న సరిత అదే సమయంలో స్టార్ హీరోయిన్స్ గా అనేక మంది నటీమణులకు డబ్బింగ్ చెప్పించడం అనేది నిజంగా ఒక సంచలనం. 90 వ దశకంలో స్టార్ హీరోయిన్స్ నగ్మా, విజయశాంతి నుంచి సౌందర్య , రమ్యకృష్ణ వంటి చాలా మందికి ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆమె లేని సినిమా అప్పట్లో లేదంటే నమ్మాల్సిందే.
ఆమె సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ ముగిశాక కూడా డబ్బింగ్ కొనసాగించింది.. అలాగే సరిత సీరియల్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తన స్నేహితురాలు రాధిక కోసం రాడాన్ మీడియా సంస్థకు పని చేసింది. ఇక ఆమెకు ఎన్నో స్టేట్ అవార్డ్స్ తో పాటు ఆరు సార్లు ఫిలిం ఫేర్ కూడా లభించడం విశేషం. మంచికి స్థానం లేదు అనే సినిమాతో తొలిసారి నటిగా మారింది సరిత. ఆ తర్వాత బాలచందర్ దర్శకత్వం లో వచ్చిన మరో చరిత్ర సినిమాతో ఆమె క్రేజ్ ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది. ఒక నల్ల పిల్ల కమల్ హాసన్ లాంటి నటుడితో పోటీ పడి నటించడం అప్పట్లో ఎన్నో సంచలనాలకు అడ్రస్‌గా మారింది. సరిత సినిమా జీవితం గురించి ఎంత చెప్పిన కూడా తక్కువే.
అయితే ఆమె వ్యక్తి గత జీవితం మాత్రం నాటి నుంచి నేటి వరకు అనేక కుదింపులకు లోనవుతూ వస్తుంది. ప్రస్తుతం తన ఇద్దరు కొడుకులతో కలిసి దుబాయ్ లో ఉంటున్న సరితకు సినిమ ఇండస్ట్రీ కి రాక ముందే వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి తో పెళ్లి జరిగింది. కానీ సరితకు ఉన్న సినిమా ఇంట్రెస్ట్ తో అతడికి విడాకులు ఇచ్చింది. కానీ ఈ విషయంపై వెంకట సుబ్బయ్య అనేక సార్లు తన భార్య తనను మోసం చేసింది అంటూ మీడియా ముఖంగా చెప్పడం విశేషం.
ఇక సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సరిత ప్రేమలో పడింది. అప్పట్లో స్టార్ కెమెరా మ్యాన్ అయినా నవకాంత్ అనే వ్యక్తి తో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించింది సరిత. అయితే ఈ సరి విధి ఆమెతో చెలగాటం ఆడింది. నవకాంత్ ప్రమాద వశాత్తు చనిపోవడంతో ఆమె హృదయం ముక్కలయింది. ఈ సంఘటన నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన తోటి నటుడు ముకేశ్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోగా ఇద్దరికి కొడుకులు పుట్టారు. అయితే ఈ పెళ్లి కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది.
ముకేశ్ మరొక నటి తో క్లోజ్ గా ఉంటూ సరిత ను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. అంతే కాదు ఆమె ఇండియాలో లేని సమయంలో విడాకుల నోటీసు ఇచ్చి, అందుకు బదులు ఇవ్వడం లేదు అనే ఒకే ఒక్క సాకుతో సరితకు తెలియకుండానే విడాకులు పొందాడు. ఆ తర్వాత మరొక పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత విషయం తెలిసి ఆమె ఇండియాకు వచ్చి కోర్ట్ లో కేసు వేసినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం పిల్లలతో ఒంటరిగానే ఉంటుంది సరిత.