సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచం మాయలో పడిన వారు చాలా మంది పతనమైపోతారు. అదే దీనిని చక్కగా క్యాష్ చేసుకున్నోళ్లు మాత్రం సక్సెస్ అవుతారు. నాటి తరంలో మహానటి సావిత్రి ఎంత గొప్ప నటో తెలిసిందే. కోట్లాది ఆస్తులు కూడబెట్టుకున్న ఆమె చేసిన తప్పుల వల్ల జీవిత చరమాంకంలో ఎంత దీనస్థితిలో చనిపోయిందో మనందరకు తెలిసిందే. మహానటి సినిమాలోనూ ఈ విషయాన్ని ఎంతో చక్కగా చూపించారు. ఇక ఇదే కోవలో అలనాటి మరో నటి సైతం బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాంగ్ స్టెప్పులతో కెరీర్ నాశనం చేసుకున్నారు. ఆ నటి ఎవరో కాదు ఒకప్పటి క్రేజీ హీరోయిన్ శుభ.
శుభది బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తండ్రి వేదాంతం రాఘవయ్య.. ఒకప్పటి గ్రేట్ డైరెక్టర్. దేవదాసు, సువర్ణ సుందరి, అనార్కలీ లాంటి క్లాసిక్ సినిమాలకు ఆయన దర్శకుడు. ఆయన భార్య సూర్యప్రభ తెలుగువారే. సూర్యప్రభ ఎవరో కాదు… జెమినీ గణేషన్ మొదటి భార్య పుష్పవల్లికి స్వయానా చెల్లి. అంటే జెమినీ గణేషన్.. వేదాంతం రాఘవయ్య స్వయానా తోడళ్లుల్లు అవుతారు.
ఇక బాలీవుడ్ మేటినటి ఒకప్పటి క్రేజీ హీరోయిన్ రేఖ జెమినీ గణేషన్, పుష్పవల్లి కూతురు కావడంతో శుభకు ఆమె స్వయానా అక్క అవుతుంది. ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్న శుభ తెలుగు, తమిళ భాషల్లో కెరీర్ స్టార్ట్ చేసింది. సినిమా ఛాన్సులు బాగానే వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్లు పడ్డాయి. ఆ తర్వాత మళయాళంలో ఆమె ఓ ఊపు ఊపేసింది.
మళయాళంలో కొన్నాళ్ల పాటు తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె కెరీర్‌లో 300కు పైగా సినిమాలు చేస్తే.. అందులో మళయాళ సినిమాలే 100 వరకు ఉండేవి. ఆ తర్వాత ఆమె రాంగ్ ట్రాక్ పట్టేసింది. మద్యంకు అలవాటు పడడంతో పాటు గుర్రపు రేసులు ఆడడంతో ఆమె సంపాదన అంతా కరిగిపోయింది. అప్పట్లో మద్రాస్ కల్చర్ గుర్రపు రేసులు ఆడడం.. కాసినో ఆడడం.. శుభ అయితే ఒకేసారి డబ్బు కట్టలు తీసుకు వెళ్లి పోగులు పోగులుగా టేబుళ్ల మీద కుమ్మరించేసేదట.
అలా ఆమె ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. అదే టైంలో మద్యంకు అలవాటు పడడం.. తాను నమ్మిన ఒకరిద్దరితో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంతో కెరీర్ నాశనం అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఆమె సెకండ్ ఇన్సింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. నాగార్జున అన్నమయ్య సినిమాలో ఏమో అండి నాకేం తెలీదు అంటూనే అన్నీ బయటకు చెప్పేసే అమాయకపు తల్లి క్యారెక్టర్ చేసింది..
ఆ తర్వాత కూడా ఆమె విజేత, కార్తీకదీపం సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ హైదరాబాద్‌కు షిప్ట్ అయినా ఆమె మాత్రం చెన్నైలోనే ఉండడంతో అలా తెలుగు తెరకు… తెలుగు ఇండస్ట్రీకి ఆమెకు గ్యాప్ పెరిగిపోయింది. శుభ కెరీర్ బాగున్నప్పుడు బాగా ప్లాన్ చేసుకుని ఉంటే ఆమె మంచి స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేది.