హమ్మయ్య.. ఎట్టకేలకు మెగా అభిమానుల కల నెరవేరింది. మెగాస్టార్ చిరంజీవి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్నాడు . మొదటి నుంచి గాడ్ ఫాదర్ సినిమాపై మెగా అభిమానులు ఓ టెన్షన్ నెలకొంది. ఈ సినిమా లూసిఫర్ కి ఎక్కడ అదే విధంగా ఉంటుందో ఎక్కడ సినిమా ఫ్లాప్ అవుతుందో మళ్లీ ఆచార్యా లాగా ఎక్కడ చిరంజీవి బాధ పడాల్సి వస్తుందో అంటూ తెగ టెన్షన్ పడ్డారు. అయితే సినిమా మొదటి బొమ్మ పడగానే సినిమాలోని మ్యాటర్ మొత్తం అర్ధమైపోయింది . సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసారు మెగా ఫ్యాన్స్.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార ఆయన సిస్టర్ గా నటించిన సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాను మోహన్ రాజా తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేశాడు. నిజానికి ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పాల్సింది డైరెక్టర్ మోహన్ రాజా పేరు. ప్రతి సీన్లో తన మార్కులు చూపించాడు మోహన్ రాజా. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ నయనతార ఎక్స్ప్రెషన్స్ . పాత్ర చిన్నదే అయినప్పటికీ ..ఆమె నటించిన తీరు విమర్శకులను కూడా ప్రశంసలు అందుకునేలా చేస్తుంది. ఇక సత్యదేవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అంతలా తనలోని నటుడిని బయటకు తీసుకొచ్చాడు . మెగాస్టార్ కి ఏ మాత్రం తీసుపోని విధంగా ఆయనతో ఢీకొట్టే పాత్రలో నటించాడు. సినిమాలో హీరోయిన్ లేనప్పటికీ మెగాస్టార్ ఆ లోటును తెలియకుండా .. ఈ సినిమాలో నటించి శభాష్ అనిపించాడు. కాగా సినిమాకి అన్నిటికన్నా బిగ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ..టైటిల్ గాడ్ ఫాదర్ వింటుంటేనే అవి ఏదో తెలియని ఓ వైబ్రేషన్స్ గౌరవం పెరిగిపోతుంది. నిజానికి ఈ సినిమా తెరకెక్కించాలి అనుకున్నప్పుడు డైరెక్టర్స్ మేకర్ ఈ సినిమాకు అనుకున్న టైటిల్ “రాజ ‘కీ’ య నాయకుడు” అని పెట్టాలనుకున్నారట. ఆ తర్వాత చిరంజీవి అందరికీ గాడ్ ఫాదర్ గా ఉంటాడు.. ఇండస్ట్రీలో కూడా అదే ఫీలింగ్.. ఈ టైటిల్ అయితే కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అంటూ మేకర్స్ చేంజ్ చేశారట. టైటిల్ ఏదైనప్పటీకి కంటెంట్ ముఖ్యం. కంటెంట్ పరంగా ఈ సినిమాలో వెళ్లూ ఎత్తి చూపించాల్సిన అవసరమే లేదు.