Moviesప్రేమించినోడే శ్రీముఖిని అంత వేధించాడా... సూసైడ్ ఎటెంప్ట్ ప్లాన్ కూడా...!

ప్రేమించినోడే శ్రీముఖిని అంత వేధించాడా… సూసైడ్ ఎటెంప్ట్ ప్లాన్ కూడా…!

తెలుగులో యాంకర్స్ గా రాణిస్తున్న వాళ్ళలో శ్రీముఖి కూడా ఒకరు. ప్రస్తుతం శ్రీముఖి వరుస టివి షోలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు బుల్లితెర యాంక‌రింగ్ రంగానికి హాట్ సొగ‌సులు అద్ది.. బుల్లితెర‌పై కూడా గ్లామ‌ర్ ట‌చ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఎలా ఎట్రాక్ట్ చేయాలో నేర్పింది మాత్రం శ్రీముఖినే. అన‌సూయ ఓ మోస్త‌రుగా గ్లామ‌ర్ ట‌చ్ ఇస్తే శ్రీముఖి టాప్ హీరోయిన్ల‌కు మించిన గ్లామ‌ర‌సం ఒల‌క‌బోసి స‌రికొత్త హంగులు అద్దింది.

శ్రీముఖి చేసిన షోల‌కు బుల్లితెర టీఆర్పీ రికార్డులు ఎన్నో బ్రేక్ అయ్యాయి. ఈటీవీ మరియు మాటీవీతో పాటు జీ తెలుగులో వివిధ షోలు చేస్తోంది. శ్రీముఖి యాంకర్ రవితో కలిసి పటాస్ షో చేయ‌గా… ఈ షో మంచి సక్సెస్ అవ్వడంతో పాటు శ్రీముఖి యాంకరింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాతనే తెలుగులో ఎక్కువ‌ ఆఫర్లను అందుకుంది. యాంకర్ గా కంటే ముందు నటిగా సైతం శ్రీముఖి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లి పాత్రలో నటించి మెప్పించింది.

అంతేకాకుండా ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో శ్రీముఖి నటించి ఆకట్టుకుంది. అయినా నటిగా అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. శ్రీముఖి యాంకర్ అయినా గ్లామర్ షో విషయంలో హీరోయిన్లకు సైతం పోటీగా నిలుస్తోంది. ఇక యాంకర్ శ్రీముఖి ఏజ్ పెరుగుతున్నా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. గతంలో శ్రీముఖి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

కాగా షో లో శ్రీముఖి హౌస్ లో ఓ రోజు తన పర్సనల్ విషయాలను పంచుకుంది. తాను హౌస్ లోకి రిలేషన్ షిప్ పెట్టుకోవడానికి రాలేదని చెప్పింది. ఒకప్పుడు తాను కూడా రిలేషన్ షిప్ లో ఉండేదాన్ని.. కానీ బ్రేకప్ అయిందని చెప్పింది. బ్రేకప్ జరిగిన సమయంలో చనిపోదామనుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే తాన బాయ్ ఫ్రెండ్ ఎవరు ఏం చేస్తుంటాడు ….? అన్న విషయాలను మాత్రం శ్రీముఖి వెల్లడించలేదు. దీంతో శ్రీముఖి ప్రేమ విష‌యం అలా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news