టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దా ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ ఒకటి. మెగా ఫ్యామిలీ అంటే ఇక్కడ ఇంకో ఫ్యామిలీ కూడా ఉంది. అదే అల్లు ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, కళ్యాణ్ దేవ్..ఇలా దాదాపు 10మంది వరకూ ఉన్నారు. అందుకే, ఏ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చినా ముందు ఫోకస్ చేసేది మెగా ఫ్యామిలీ మీదే.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లోఫర్. ఈ సినిమాతో బాలీవుడ్ అందాల భామ దిశా పటాని టాలీవుడ్‌కి పరిచయమైంది. మొదటి సినిమా ఫ్లాపవడం అమ్మడికి గట్టి దెబ్బపడింది. ఏ హీరోయిన్‌కైనా మొదటి సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. ఆ ఒక్కటి గనక భారీ హిట్ పడితే ఇక అవకాశాలన్నీ ఆ హీరోయిన్ కోసమే అనేట్టుగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇలా మొదటి సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించడంతో అరడజను సినిమాలకి సైన్ చేసిన కృతిశెట్టినే దీనికి ఉదాహరణ.
కానీ, అందరు కృతిశెట్టిలా అదృష్టవంతులు కారు. అందుకే, మొదటి సినిమా తర్వాత వచ్చినదారినే వెనక్కి వెళుతున్నారు. దిశా పటాని కూడా అలా వెనక్కి వెళ్ళాల్సి చచ్చింది. అమ్మడి టార్గెట్ మెగా ఫ్యామిలీ అట. వరుణ్ తేజ్ సరసన నటించి సినిమా ఫ్లాపైనా కూడా మెగా ఫ్యామిలీ హీరోల సరసన అవకాశం దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, ఒక్క సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. బాలీవుడ్లో హీరోయిన్గా నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుంది. అక్కడ సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్ లాంటి వారికి హాట్ బ్యూటీ.
అదే క్రేజుతో టాలీవుడ్లో దిగాలని ట్రై చేసింది. పుష్ప మొదటి భాగంలో అమ్మడు కూడా ఓ భాగం కావాలనుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఇక్కడ దిశకి ఆ దశ తిరగలేదు. పుష్ప మూవీలో సమంత చేసిన ఐటెం సాంగ్‌కి దిశా పటానినీ అనుకున్నారు. కానీ, రెమ్యునరేషన్ పరంగా ఇది క్యాన్సిల్ అయిందా లేక మరేదైనా కారణమా తెలియదు గానీ, పాన్ ఇండియా హిట్ పుష్పలో ఛాన్స్ మిస్సైంది. మళ్ళీ ఇప్పుడు పార్ట్ 2 కోసం మళ్ళీ దిశా పటాని పేరు వినిపిస్తోంది. మరి ఈసైరానా ఆ ఛాన్ అందుకుంటుందా లేదా చూడాలి.