టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో నటి హేమ కూడా ఒకరు. హేమ తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. తన కెరీర్ లో దాదాపుగా 200లకు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. తల్లి, అత్త, అక్క, వదిన ఇలా ఎన్నో రకాల పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండున్నర దశాబ్దాల నుంచి ఆమె ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతోంది.
బ్రహ్మానందంతో కలిసి హేమ చేసే కామెడీని ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. జులాయి సినిమాలో వీరిద్దరి మధ్య ఉండే కామెడీ సీన్లు, థియేటర్ లో నవ్వులు పూయించాయి. హేమ సినిమాలలో నటించడంతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో చురుకుగా పాల్గొంటారు. మా ఎన్నికల్లో పోటీ చేస్తూ యాక్టివ్ గా కనిపిస్తారు. గత ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున హేమ పోటీ చేసి విజయం సాధించారు.
ఇక హేమ ఆన్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉంటుదో చాలామందికి తెలుసు. కానీ ఆమె ఆఫ్ స్క్రీన్ లైఫ్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హేమ. తన తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిపింది. దాంతో తాము ఆరుగురు సంతానం అని చెప్పింది. వారందరిలో తాను చాలా చురుకు అని.. దాంతో తన తల్లిదండ్రులు సైతం గారాబం చేశారని చెప్పింది.
ఇక కుటుంబ పోషణ కష్టం అవడంతో తన తండ్రి వ్యవసాయంతో పాటు తాపీ పనులు సైతం చేసే వారిని పేర్కొంది. సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లిన కొత్తలో తన తల్లితో కలిసి ఉండేదాన్ని.. అప్పుడే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో నేర్చుకున్నట్టు చెప్పింది. అంతేకాకుండా సినిమాల్లో నటించే ముందు తాను కొన్ని నియమ నిబంధనలను పెట్టుకున్నాను అని పేర్కొంది.
ఇతరుల డబ్బు కోసం ఆశపడటం…. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం లాంటివి చేయకూడదని తాను నిర్ణయించుకున్నానని హేమ తెలిపింది. తనకు స్వాభిమానం ఎక్కువ అని ఇతరులు వేలెత్తి చూపకుండా బ్రతకాలని అనుకుంటానని పేర్కొంది. ఇది ఇలా ఉంటే తాను అప్పుడప్పుడు పబ్బులకు పార్టీకి వెళతారని హేమ ఓపెన్ గా చెప్పింది. కానీ మద్యానికి సిగరెట్లకు తాను దూరంగా ఉంటానని కూడా చెప్పింది.