ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే అసలు సిసలైన రాజకీయ నాయకుడు. తాను తండ్రికి తగ్గ సినీ, రాజకీయ వారసుడినే అని మరోసారి హిందూపురం ఎమ్మెల్యే నటసింహం బాలకృష్ణ ఫ్రూవ్ చేసుకున్నారు. బాలయ్య సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడు అని ఫ్రూవ్ చేసుకున్నాడు. తండ్రి లాగా సాంఘీకం, పౌరాణికం, చారిత్రకం, జానపదం ఇలా ఎందులో అయినా ఎన్టీఆర్ స్టైల్లోనే తాను కూడా సక్సెస్ అయ్యారు.
ఇక తండ్రితో పాటు అన్న హరికృష్ణ ప్రాథినిత్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హిందూపురంలో బాలయ్యకు 2014 ఎన్నికలను మించిన మెజార్టీ వచ్చింది. హిందూపురం అంటేనే ఇటీవల కాలంలో అసాధారణ రాజకీయాలు, వర్గాలకు నిలయం అయిపోయింది. అలాంటి చోట బాలయ్య రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు హ్యాట్రిక్ కొట్టేలా దూసుకుపోతున్నారు.
బాలయ్య సాధారణంగా హిందూపురంలో ఎక్కువుగా ఉండరు. ఆయన హైదరాబాద్ లేదా సినిమా షూటింగ్‌లతోనే బిజీగా ఉంటారు. సాధారణంగా హిందూపురంలో వర్షాలు భారీగా కురవడంతో ప్రజలు అతలాకుతలం అయిపోయారు. అయితే బాలయ్య అక్కడే స్వయంగా మకాం వేసి మరీ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. తన షూస్‌కు మరకలు, బురద అంటుతుందని… తన ఇస్ట్రీ బట్టలు నలిగిపోతాయని అనుకోకుండా మోకాళ్లోతు నీళ్లలో నడుస్తూ మరీ ఆయన నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటున్నారు.
బాలయ్య కరోనా వచ్చినప్పుడు కూడా తన సొంత డబ్బులతో నియోజకవర్గంలో హాస్పటల్స్‌లో సౌకర్యాలు సమకూర్చారు. అక్కడ పేదలతో పాటు ముస్లింలను ఆదుకునేందుకు కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోకి వెళ్లకుండా పీఏలతో పనులు కానిచ్చేస్తూ ఉంటారు. కానీ బాలయ్య మాత్రం నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రజల ఇబ్బందులు తీరుస్తున్నారు.
అయితే రాజకీయంగా మాత్రం కొందరు కావాలనే బాలయ్యపై విమర్శలు చేస్తూ ఉంటారు. హిజ్రాలతో కేసులు పెట్టిస్తూ ఉంటారు. అయితే బాలయ్యది ఎంత మంచి మనస్సో అక్కడ ప్రజలకు అర్థమైపోయింది. బాలయ్యను వాళ్ల మనస్సులో పెట్టేసుకున్నారు.