సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ మధ్య కాంపిటీషన్స్ చాలా కామన్. ఓ హీరోయిన్ అనుకున్న పాత్రకు మరో హీరోయిన్ సెలక్ట్ అవ్వడం ఇండస్ట్రీలో సర్వసాధారణం . ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు .అయితే కనీ విని ఎరుగని విధంగా అనుపమ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో కాకుండా .. సినీ ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది. దీంతో అనుపమ పరమేశ్వరన్ .. సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు 2 పేర్లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి.
మనకు తెలిసిందే టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో జూనియర్ దేవరకొండ గా పేరు సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ అంతకుముందు పలు సినిమాలో నటించినప్పటికీ డీజే టిల్లు సినిమా ద్వారానే ఫేమస్ అయ్యాడు. ఈ సినిమాతో ఎవరు ఊహించిన స్థాయికి సిద్దు జొన్నలగడ్డ వెళ్ళిపోయాడు . ఈ సినిమాల్లో ఆయన పర్ఫామెన్స్ చూసిన జనాలు జూనియర్ దేవరకొండ అంటూ ఓ బిరుదు కూడా ఇచ్చేశాడు . ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు . అందులో ఒకటి డిజే టిల్లు 2 . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మాత్రం మొదటి సినిమాలో నటించిన నేహా శెట్టి ని తీసుకోలేదు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
అయితే ఇన్నాళ్లు ఈ సినిమాలో హీరోయిన్గా యంగ్ బ్యూటీ శ్రీ లీల అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. దీనికి సంబంధించి రేపో మాపు అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేస్తుంది అనుకున్నారు . అయితే రీసెంట్గా శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పకున్నట్లు తెలుస్తుంది. శ్రీ లీల సిద్దు లాంటి హీరో పక్కన చేస్తే తనకు మాస్ ఇమేజ్ పడుతుందని.. అలా కాకుండా ఆమె స్టార్ హీరో సినిమాల అవకాశాలు అందుకోవాలని ..బిగ్ హీరోస్ తో నటించాలని ఫిక్స్ అయిందట. ఈ క్రమంలోనే సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. కాగా శ్రీ లీల తప్పుకోగానే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఆఫర్ అందుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ.
రీసెంట్గా కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న అను అయితే ఈ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని మేకర్స్ భావించారట. ఈ క్రమంలోనే ఆమెను అప్రోచ్ అయ్యి కథ వివరించే లోగానే ఆమె కళ్ళు మూసుకుని అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసేసిందట. తన పాత్ర ఏంటి తన రెమ్యూనరేషన్ ఏంటి కాల్ షీట్స్ ఎన్ని కావాలి అని బుక్ చేసుకోకుండానే అనుపమ ఇలా డీజే టిల్లు 2 సినిమా అగ్రిమెంట్ పేపర్స్ పై సైన్స్ చేయడం సినీ ఇండస్ట్రీలోని సంచలనంగా మారింది. అసలు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారు అని కూడా అడగకుండానే ఇలా చేయడం నిజంగా షాకింగ్ గా ఉంది అంటున్నారు అభిమానులు. దీంతో శ్రీ లీల లాంటి యంగ్ హీరోయిన్ కి నోరు మూయించే విధంగా చేసింది అనుపమ అంటూ న్యూస్ వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కాదు కథను.. కథలోని కంటెంట్ ను నమ్మాలి అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.