టాలీవుడ్ లోని హాట్ యాంకర్స్‌లో విష్ణు ప్రియ కూడా ఒకరు. పోవే పోరా అనే టీవి షో ద్వారా విష్ణు ప్రియ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ టీవీ షోలో సుధీర్ తో కలిసి విష్ణుప్రియ సందడి చేసింది. సుధీర్ విష్ణు ప్రియ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో యూత్ ఈ టీవీ షోకు ఫిదా అయ్యారు. ఈ షో సక్సెస్ అవడంతో విష్ణు ప్రియ చాలా టీవీ షోలలో సందడి చేసింది. ప్రస్తుతం విష్ణు ప్రియ సినిమాల్లోనూ నటిస్తోంది. అంతే కాకుండా ఐటెం సాంగ్స్ లో నటించే అవకాశం వచ్చినా సై అంటోంది. ఎక్కువగా విష్ణుప్రియ గ్లామర్ పాత్రలోనే కనిపిస్తోంది.
అంతే కాకుండా సోషల్ మీడియాలో విష్ణుప్రియ చేసే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా విష్ణు ప్రియ అందాల ప్రదర్శన కనిపిస్తోంది. ఏమీ దాచుకోకుండా అన్నీ చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. దాంతో సోషల్ మీడియాలో విష్ణు ప్రియ ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో విష్ణు ప్రియ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన పెళ్లి ప్రస్తావన రాగా ఆసక్తికర కామెంట్లు చేసింది.
తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని చెప్పింది. పెళ్లి చేసుకోవాలంటే చాలా మెచ్యూరిటీ ఉండాలని విష్ణు ప్రియ వ్యాఖ్యానించింది. తనకు మెచ్యూరిటీ లేదని 29 – 30 ఏళ్లు వస్తే మెచ్యూరిటీ వస్తుందేమో అప్పుడు ఆలోచిస్తా అంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా తనకు కాబోయే వాడి క్వాలిటీస్ ఎలా ? ఉండాలో కూడా విష్ణుప్రియ చెప్పేసింది. తనకు కాబోయే వాడికి దేవుడికున్నంత ఓర్పు ఉండాలని చెప్పింది.
మహిళలకు గౌరవం ఇవ్వాలని డియర్ కామ్రేడ్ లాగా ఉండాలని చెప్పింది. అంతేకాకుండా చూడడానికి అరబిక్ ఫేస్ కట్ ఉండాలని తెలిపింది. చాలా పొడుగ్గా ఉండాలని చూస్తే హాట్ గా చెమటలు పట్టాలని చెప్పింది. రియల్ లైఫ్ లో అలాంటి అబ్బాయిలు కనిపించినప్పుడు నేరుగా వెళ్లి ప్రపోజ్ చేస్తానని చెప్పింది. అలాంటి అబ్బాయిలను చూసినప్పుడు నేత్రానందం పొందుతానంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.