Moviesఈ 4 గురు స్టార్ హీరోల్లో బాల‌య్య‌కు మాత్ర‌మే ఆ స‌త్తా...

ఈ 4 గురు స్టార్ హీరోల్లో బాల‌య్య‌కు మాత్ర‌మే ఆ స‌త్తా ఉందా…!

టాలీవుడ్ లో చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున ఒకప్పుడు బడా హీరోలు 1980-90 దశ‌కంలో ఈ నలుగురు హీరోలు కెరీర్ ప్రారంభించారు. అంతకు ముందు వరకు ఎన్టీఆర్- ఏఎన్నార్- కృష్ణ- కృష్ణంరాజు లాంటి హీరోల మధ్య ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ జరిగేది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాక ముందు వరకు ఆయనే ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోగా ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌తో ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ టాప్ ర్యాంకు కోసం పోటీపడేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిపోయాక చిరంజీవి ఒక్కసారిగా టాలీవుడ్ శిఖరాగ్రం మీదకు దూసుకు వచ్చారు. చిరుకు వరుస హిట్లు పడడంతో పాటు మెప్పించే డ్యాన్సులు ఫైట్లు చేయడంతో చిరంజీవి ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

చిరుకు ఖైదీ సినిమాతో తిరుగులేని స్టార్‌డం వచ్చింది. అయితే అప్పుడప్పుడే బాలయ్య- వెంకటేష్- నాగార్జున కెరీర్ ప్రారంభించారు. 90వ ద‌శ‌కం ప్రారంభానికి వచ్చేసరికి సుమన్ కూడా చిరంజీవికి పోటీగా దూసుకు వచ్చారు. కారణాలు ఏవైనా సుమన్ చాలా త్వరగా ఈ రేసు నుంచి వెనక్కు వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలయ్య నెంబర్ 2 ప్లేస్ లో కొనసాగుతూ చిరంజీవికి గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. ఎన్టీఆర్ నట వారసుడు కావడంతో పాటు తిరుగులేని మాస్ ఇమేజ్… తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన కార్యకర్తల‌ అండ ఉండడంతో బాలయ్య కూడా ఒక్కోసారి చిరంజీవిని డామినేట్ చేసేవారు.

1990 తర్వాత బాలయ్యతో పోలిస్తే చిరంజీవికి ఎక్కువ హిట్లు వచ్చినా… ఇండస్ట్రీ హిట్లు మాత్రం సమరసింహారెడ్డి- నరసింహనాయుడు రూపంలో బాలయ్యకే దక్కాయని చెప్పాలి. ఇక చిరంజీవి, బాలయ్య 1- 2 ప్లేసుల్లో ఉంటే నాగార్జున- వెంకటేష్ 3- 4 ప్లేసుల్లో కొనసాగే వారు. ప్రారంభంలో నాగార్జున 3వ‌ ప్లేసులో వెంకటేష్ 4 ప్లేసులో ఉండేవారు. అయితే వెంకటేష్‌కు వరుసగా సూపర్ హిట్లు పడటం.. నాగార్జునకు వరుస ప్లాప్‌లు రావడంతో వెంకీ- నాగార్జునను వెనక్కి నెట్టేసి మూడో ప్లేసులోకి వచ్చేసారు. అయితే 2000 దశకం తర్వాత పవన్ కళ్యాణ్- మహేష్ బాబు- ప్రభాస్- జూనియర్ ఎన్టీఆర్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోల మొదలు కావడంతో ఈ నలుగురు స్టార్ హీరోల స్పీడ్ కాస్త తగ్గుతూ వచ్చింది.

2022లో కట్ చేస్తే ఈ నలుగురు స్టార్ హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి 40 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికి నలుగురు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. చిరంజీవి మాత్రం మధ్యలో పదేళ్లపాటు పాలిటిక్స్ లోకి వెళ్లి గ్యాప్‌ తీసుకుని రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఈ నలుగురు హీరోలలో కుర్ర హీరోలకు పోటీగా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. బాలయ్య. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో హిట్ కొట్టినా సైరా- ఆచార్య సినిమాలు ఆయనను తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు చిరంజీవి లైన్ అఫ్‌లో ఉన్న సినిమాలు కూడా ఏమంత ఆసక్తి కలిగించడం లేదు.

అయితే గాడ్ ఫాదర్ సినిమాకు హిట్ టాక్ వచ్చిన తొలిరోజు కాస్త అటు ఇటుగా 17 కోట్ల షేర్ రాబట్టింది. నాగార్జున ఘోస్ట్ అయితే మరీ దారుణంగా 2.42 కోట్ల షెర్‌తో సరిపెట్టుకుంది. వైల్డ్ డాగ్- మన్మధుడు 2- ఆఫీసర్ సినిమాలు నాగార్జున ఇమేజ్‌ను ఘోరంగా దెబ్బ తీసేశాయి. కొడుకు చైతన్యతో కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా బంగార్రాజు లేకపోతే నాగార్జున సినిమాలు ప్రేక్షకులు పట్టించుకోవటమే మానేసే పరిస్థితి వచ్చింది. ఇక వెంకటేష్ కూడా వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేయటం లేదా ఓటీటీ సినిమాలు చేసుకునే స్థితికి పడిపోయారు. ఈ నలుగు సీనియర్ హీరోలలో ఒక్క బాలయ్య మాత్రమే బాక్సాఫీస్ ను కాస్త హీటెక్కిస్తూ.. కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు.

 

అఖండతో తనేంటో ప్రూవ్ చేసుకున్న బాలయ్య ఇప్పుడు వరుసగా క్రేజీ డైరెక్టర్లతో క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నారు. మరోవైపు ‘అన్‌స్టాప‌బుల్‌ షో తో బుల్లితెర‌ను కూడా షేక్ చేశారు. చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలు చేయటం… మూస కథలతో సినిమాలు చేయటం.. ఇటు బుల్లితెరపై బాలయ్యతో పోలిస్తే అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాకపోవటంతో ఈతరం ప్రేక్షకులకు కూడా ఈ నలుగురు హీరోలలో బాలయ్యే బాగా కనెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు రాజకీయంగా కూడా బాలయ్య వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news