టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి అందరికీ పరిచయమే. ఈయన టాలీవుడ్ దర్శకనిర్మాత ఇ.వి.వి సత్యనారాయణ రెండో కుమారుడు. 2002లో రవిబాబు దర్శకత్వం వహించిన అల్లరి సినిమాతో అల్లరి నరేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ద్వారా తన పేరు ముందు అల్లరి చేర్చుకొని అల్లరి నరేష్ గా గుర్తింపు పొందాడు.
అల్లరి నరేష్ వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. తాను నటించిన చిత్రాలలో మెజారిటీ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో హాస్య చిత్రాలలో ప్రధాన పాత్రలకు ప్రసిద్ధి చెందిన నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. ఒకప్పుడు కామెడీ సినిమాలకు రాజేంద్ర ప్రసాద్ పెట్టింది పేరు. ఆ తర్వాత తరంలో ఆ స్థానాన్ని నరేష్ కొన్నేళ్ల పాటు భర్తీ చేశాడు.
2008లో గమ్యం సినిమాలో నటించి నరేష్ ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. అల్లరి నరేష్ తన అన్నయ్య ఆర్యన్ రాజేష్ తో కలిసి వారి నిర్మాణ సంస్థ ఇ.వి.వి కింద సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా అల్లరి నరేష్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. హీరోగానే కాకుండా మహేష్‌బాబు మహర్షి సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తూ సరికొత్త ఇన్సింగ్స్ కూడా స్టార్ట్ చేశాడు.
అయితే గతంలో అల్లరి నరేష్ గురించి ఒక వార్త బాగా వైరల్ అయింది. ఒక టాలీవుడ్ హీరోయిన్ తో అల్లరి నరేష్ ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అల్లరి నరేష్ తో సీమశాస్త్రి, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ లో ఫర్జానా హీరోయిన్ గా నటించింది. రెండు సినిమాలలో కలిసి నటించడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అప్పట్లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరిగింది.
అయితే ఒక సందర్భంలో అల్లరి నరేష్ ఈ వార్తల గురించి క్లారిటీ ఇచ్చారు. తనకు ఫర్జానాకు మధ్య ఏదో ఉందని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఫర్జానాకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగిందని.. ఆమె తన కుటుంబంతో అమెరికాలో ఉంటుంది అని అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చాడు. వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అల్లరి నరేష్ చెప్పడం గమనార్హం. అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చినా అల్లరి నరేష్ చెప్పిన విషయాన్ని చాలామంది నమ్మలేదు.