ప్రతి భర్తకి తన భార్య అంటే ఇష్టం ఉంటుంది. ప్రతి భార్యకి తన భర్త అంటే ఇష్టం ఉంటుంది .కానీ ఇక్కడ నయనతార విగ్నేష్ శివన్ చేసిన హాట్ కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో యం ట్రెండింగ్ గా ఉన్నాయి. అంతేకాదు కొందరైతే ప్రపంచంలో మీరే పెళ్లి చేసుకున్నారా..? మిగతా ఎవరు పెళ్లి చేసుకోలేదా..? అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం రీసెంట్గా నయనతార విగ్నేష్ పెళ్లి డాక్యుమెంటరీ కి సంబంధించిన ప్రోమో పార్ట్ వన్ రిలీజ్ అవ్వడమే.
మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ జరుపుకున్న ఈ జంట ఇప్పటికే రెండు హనీమూన్లు కంప్లీట్ చేసుకుని త్వరలోనే మూడోహనీమూన్ కు ప్లాన్ చేసుకుంటుంది. అయితే మనకు తెలిసిందే.. వీళ్ళు తమ పెళ్లి వీడియోని ఓ డాక్యుమెంటరీ రూపంలో అభిమానులకు చుయిస్తున్నారు . దీన్ని డైరెక్టర్ గౌతమ్ మీనన్ తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన ప్రోమో ని రీసెంట్ గా క నెట్ ఫిక్స్ రిలీజ్ చేసింది.
ఈ క్రమంలోనే నయనతార మాట్లాడుతూ..” నేనేం స్టార్ కిడ్ ని కాదు. నాకు కూడా అందరు ఆడపిల్లలు లాగే పెళ్లి అనే విషయం కొత్త అని.. డిఫరెంట్ ఫీలింగ్స్ అని ఖచ్చితంగా ..ఆ బంధాన్ని నిలబెట్టుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక ఇదే క్రమంలో విగ్నేశ్ మాట్లాడుతూ..” నయనతార అందరికీ ఓ హీరోయిన్ గానే తెలుసు ..తన పర్సనల్గా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు .అది నాకు మాత్రమే తెలుసు .అంతే కాదు నా బంగారం నాకోసం ఎన్నో వదులుకునింది. నాకోసం ఎన్నో చేంజ్ చేసుకుంది. నాకు నచ్చినట్లుగా నన్ను మెప్పించే విధంగా తనకి ఇష్టమైనవి వదులుకొని నన్ను సంతోష పెట్టింది. ఇలాంటి వైఫ్ నాకు దొరకడం రియల్లీ హ్యాపీ.. ఐ లవ్ యు నయన్..” అంటూ ప్రోమోలో చెప్పుకొచ్చాడు . దీంతో నయన్ విగ్నేష్ పెళ్లి ప్రోమోకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.