సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎప్పుడు ఎలా ఎవరిపై ట్రోలింగ్ జరుగుతుందో అర్థం కాని పొజిషన్లో ఉండిపోతున్నారు జనాలు. అది మంచి కాదు, చెడు కాదు సమయం సందర్భం తెలుసుకోకుండా ట్రోలర్స్ హద్దులు మీరి మరి ట్రోల్ చేస్తున్నారు. దీంతో చాలామంది సెలబ్రిటీస్ బాధపడుతున్నారు. మనకు తెలిసిందే టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ మధ్యనే మరణించారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన గత నెల రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన తుది శ్వాస విడిచారు .
కాగా ఈ ఊహించని పరిణామంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయనతో కలిసి నటించిన నటులు ఆయనతో కలిసి వర్క్ చేసిన రాజకీయ నాయకులు అందరూ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ అయితేతే పుట్టేడు బాధలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ప్రభాస్ , కృష్ణం రాజు పార్థవ దేహం వద్ద కన్నీరుగా వినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతలా ఆయన బాధపడుతుంటే కొందరు పని పాట లేని ట్రోలర్స్ ఆయనపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పెదనాన్న చనిపోయిన పుట్టెడు బాధలో ప్రభాస్ ఉంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ ,,మరి కొద్ది రోజుల్లో పెళ్లి ..అంటూ మీడియాలో వార్తలు రావడం ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు..” సిగ్గు లేదారా మీకు పెదనాన్న చనిపోయిన బాధల ప్రభాస్ ఉంటే ఇప్పుడు ఇలాంటి వార్తలు పుట్టిస్తారా మనుషులేనా” అంటూ దారుణమైన కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ కృతి సనన్ పేర్లు సోషల్ మీడియాలో మళ్లీ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి.