Moviesఆ సినిమా ప్లాప్ ఎఫెక్ట్‌... కార్లన్నీ అమ్మేసి.. సైకిళ్ల‌పై తిరగాల‌ని ఎన్టీఆర్...

ఆ సినిమా ప్లాప్ ఎఫెక్ట్‌… కార్లన్నీ అమ్మేసి.. సైకిళ్ల‌పై తిరగాల‌ని ఎన్టీఆర్ షాకింగ్ డెసిష‌న్‌..!

సినిమా రంగంలో త‌న‌దైన గుర్తింపు పొందిన.. ప్ర‌తిభా శాలి.. నంద‌మూరి తార‌క రామారావు. తొలి నాళ్లలో ఆయ‌న అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందులు కూడా ప‌డ్డారు. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చి నా.. వ‌దులుకోకుండా ముందుకు సాగారు. ఇలా.. నెమ్మ‌ది నెమ్మ‌దిగా పుంజుకున్న రామారావుకు డ‌బ్బు విలువ బాగా తెలుసు..! అందుకే.. ఆయ‌న దానాలు ధ‌ర్మాల‌కు చాలా దూరంగా ఉన్నారు. ఇది ఆయ‌న‌లో ని ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను మ‌రింత మెరుగు ప‌రిచింది.

అయితే.. ఎంత ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న‌ప్ప‌టికీ.. నిర్మాత‌లు న‌ష్ట‌పోవడాన్ని.. ఆయ‌న ఓర్చుకోలేక పోయా రు. ఏదైనా బల‌మైన క‌థ‌తో నిర్మాత సినిమా తీసిన త‌ర్వాత‌.. అది ఆడ‌క‌పోతే.. నిర్మాత న‌ష్ట‌పోతే.. వెంట‌నే రామారావు స్పందించేవారు. త‌ను తీసుకున్న పారితోషికం నుంచి కొంత భాగాన్ని భ‌ర్తీ చేసేవార‌ట‌. దీంతో నిర్మాత అంతో ఇంతో ఉప‌శ‌మ‌నం పొందేందుకు అవ‌కాశం ఉంటుంద‌నేది.. ఎన్టీఆర్ ఆలోచ‌నగా పేర్కొన్నారు.. ప్ర‌ముఖ న‌టులు.. గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌రావు.

గుమ్మ‌డి రాసుకున్న తీపిగురుతులు – చేదు జ్ఞాప‌కాలు పుస్త‌కంలో ఒక విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు యోగానంద్ ద‌ర్శ‌కత్వంలో `తోడు దొంగ‌లు` అనే సినిమా రూపొందింది. ఇది సందేశాత్మ‌క‌మైన చిత్రం. అస‌లు.. వాస్త‌వానికి.. అన్న‌గారు.. క‌నుక సంస్థ‌ను స్థాపిస్తే.. ఆ బ్యాన‌ర్‌లో ఈ మూవీని రూపొందిం చాల‌ని అనుకున్నారు. అంత‌గా న‌చ్చిన సినిమా. దీనిలో మ‌రో దొంగ‌గా.. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు.. న‌టిం చాల్సి ఉంది. కానీ, ఆయ‌న బ‌దులు గుమ్మ‌డిని తీసుకున్నారు.

అయితే..ఈ సినిమా అనుకున్న విధంగా సాగలేదు. చాలా న‌ష్టాలు తీసుకువ‌చ్చింది. కానీ, ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా జోరుగా ముందుకు సాగుతుంద‌ని అనుకున్నారు. కానీ, న‌ష్టాలు వ‌చ్చాయి. దీంతో తీవ్ర నిర్వేదానికి గురైన ఎన్టీఆర్‌.. ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌.. పుండ‌రీ కాక్ష‌య్య‌ను పిలిచి.. “ఇదిగో.. పుండ‌రీకాక్ష‌య్య కార్లన్నీ అమ్మేసెయ్‌.. సైకిళ్ల‌పై తిరుగుదాం!.. ఆ డ‌బ్బు కొంత నిర్మాత‌కు స‌రిచేద్దాం.. అని వ్యాఖ్యానించార‌ట‌. అంటే.. తాను న‌మ్మిన క‌థ స‌రిగా స‌క్సెస్ కాక‌పోతే.. అన్న‌గారు ఎంత‌గా విల‌విల్లాడిపోయేవారు.. అనే విష‌యానికి.. గుమ్మ‌డి చెప్పిన ఉదాహ‌ర‌ణ ఈ ఉందంతం!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news