సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ తన అంద చందాలతో ఇప్పటికీ కుర్ర బ్యూటీలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. అంతటి అందం ఆమె సొంతం. మనకు తెలిసిందే హీరోయిన్ టబు ఎలాంటి హాట్ పెర్ఫార్మన్స్ ఇవ్వగలరో. హోమ్లీగా అయినా సెక్సీగా అయినా ఎలాంటి రోల్ లో అయినా తనకు తానే సాటి అంటూ ప్రూవ్ చేసుకోగలరు . మల్టీ టాలెంటెడ్ గల నటి. ఇదే విషయం అంటుంటారు ఆమె ను చూసిన జనాలు. ఆమె టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి హిట్ హీరోయిన్ల లిస్టులో చేరింది.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ఓ రేంజ్ లో దూసుకుపోయే విధంగా ప్లాన్ చేసుకుంది టబు. ఇప్పటికే అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో వరుస సినిమాలకు కనెక్ట్ అయ్యి బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకుంటున్న టబు రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రజెంట్ ఇప్పుడు ఆ కామెంట్స్ టాలీవుడ్ ని బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి.
రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమెకు ఎదురైన ప్రశ్నకు ధీటుగా ఆన్సర్ ఇచ్చింది. హోస్ట్..” మీరు ఇంత వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదు. మీకు అమ్మ అని పిలిపించుకోవాలి అనే ఆశ లేదా..?” అని అడగ్గా ..ఆమె మాట్లాడుతూ ..లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. ట్బ్బు మాట్లాడుతూ..” పెళ్లి కాకుండా కూడా నేను తల్లి కావచ్చు. అలా చేస్తే నన్ను ఆపేవాడు ఎవరు. నన్ను ఎవరు ఆపరు. సరోగసి ద్వారా పిల్లల్ని కనే ఆప్షన్ ఉంది. కానీ ప్రజెంట్ నా ఫోకస్ సినిమాల వైపే ఉంది. అయినా పిల్లల్ని కనకపోతే చచ్చిపోతామా..ఏంటి..”??..అంటూ ఘాటుగా జవాబు ఇచ్చింది.