Moviesఆయన మాటలే నిజమైయాయే..దిగొచ్చిన పూరి..లాస్ట్ కి ఆ హీరోతోనే ఫిక్స్..!?

ఆయన మాటలే నిజమైయాయే..దిగొచ్చిన పూరి..లాస్ట్ కి ఆ హీరోతోనే ఫిక్స్..!?

సినీ ఇండస్ట్రీ ఓ మాయలోకం. రంగుల ప్రపంచం ..ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. స్టార్ హీరో అవుతారు అనుకున్న హీరో జీరో అవుతారు ..జీరో అనుకున్న హీరో స్టార్ అవుతారు . ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే జీరో అయ్యాడు టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒకప్పుడు ఈయన సినిమాలు తీస్తే బాక్సాఫీస్ షేక్ చేసేది. ఇప్పుడు ఈయన సినిమాలు తీస్తే జనాలు ఈయన ని షేక్ చేస్తున్నారు . అలా తయారైంది పరిస్థితి.

రీసెంట్ గా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించిన మూవీ లైగర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా సినీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. దానికి కారణాలు ఒకే ఒక్కటి పూరి చెత్త డైరెక్షన్. తీసిన సినిమానే నాలుగైదు సీన్లు మార్చి మళ్లీ మళ్లీ తీస్తుండడం జనాలకు విసుగు తెప్పించింది. దీంతో సినిమాను అట్టర్ ప్లాప్ చేసి పడేసారు. ఇక దీంతో ఆయన తదుపరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా అటకెక్కింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

జనగణమనకు ప్రొడ్యూస్ చేస్తున్న మై హోమ్ సంస్థ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. అంతేకాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాథ్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదని ఈ సినిమా నుంచి ఆయన కూడా తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే హాట్ టాపిక్ గా మారాడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్. ఎస్ జనగణమన ప్రాజెక్టు నుంచి విజయ్ దేవరకొండ తప్పుకోగానే పూరి జగన్నాథ్.. ఆయన కొడుకు ఆకాష్ ని హీరోగా పెట్టి ఈ సినిమా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడట.

దానికి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టేసాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా సరే తన కొడుకుతో హిట్ కొట్టించి ఇండస్ట్రీలో అందరి నోరులు మూయించాలని గట్టిగా డిసైడ్ అయ్యాడట పూరీ జగన్నాథ్. దీంతో చోర్ బజార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్. ఆనాడు బండ్ల గణేష్ చెప్తూనే ఉన్నాడు నీ కొడుకు ఫ్యూచర్ ముఖ్యం నీకు అని.. అయినా నువ్వు పట్టించుకోలేదు ..మిగతా హీరోలు నీతో సినిమా తీసేందుకు కూడా భయపడుతున్నారు అంటూ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది . అయితే దీనిపై పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. మరి చూడాలి విజయ్ ,పూరి జగన్నాథ్ ఏం చేస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news