సినీ రంగంలో అన్నగారి స్టయిలేవేరు.. ఆయన నటన.. ఆహార్యం ఎప్పుడూ.. హాట్ టాపిక్కే! అంతేకాదు.. అన్నగారి ఆర్థిక ముచ్చట్లు కూడా అంతే హాట్ టాపిక్. ఈ విషయాన్ని.. గుమ్మడి వెంకటేశ్వరరావు స్వయం గా రాసుకున్న `తీపిగురుతులు.. చేదు నిజాలు` ఆత్మ కథలో స్పష్టంగా చెప్పారు. అన్నగారిది భిన్నమైన మనస్తత్వం అని ఆయన అభిప్రాయపడ్డారు. మాయా బజార్ సినిమాను విజయా కంబైన్స్‌వారు తీశారు. అయితే.. వాస్తవానికి.. ఆ సినిమా ప్రారంభించే సమయానికి బడ్జెట్ ఒకటనుకున్నారు.
కానీ, అనూహ్యంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు.. పన్నులు పెంచడం.. సినీ నటుల వేతనాలు పెరిగిపోవ డం.. వంటి కారణాలతో బడ్జెట్ సరిపోలేదు. అప్పటికే.. కొన్ని బ్యాంకుల చిక్కుల్లో కూడా ఉండడంతో సహ నిర్మాత కోసం.. సంస్థ వెతికిందని.. గుమ్మడి పేర్కొన్నారు. ఈ సమయంలో తొలుత వారు.. ఎన్టీఆర్‌నే సంప్రదించారని ఆయన చెప్పారు. ఎందుకంటే… ఆ సినిమా.. మల్టీస్టారర్ మూవీ. ఆడితే.. బ్రహ్మాండంగా పోతుంది. లేకపోతే.. ఇబ్బంది తప్పదు.
నష్టం వచ్చినా.. లాభం వచ్చినా..తట్టుకునేందుకు ఎన్టీఆర్ అయితే.. సమర్ధుడు.. అని విజయ సంస్థ భావించిందట. ఎందుకంటే.. అప్పటికే ఎన్టీఆర్ అంతో ఇంతో వెనుకేసుకున్నారని.. విజయ సంస్థ చెప్పేది కాబట్టి.. అని గుమ్మడి పేర్కొన్నారు. కానీ.. ఎప్పుడు విజయవాళ్లు ఏమడిగినా కాదనని ఎన్టీఆర్ .. నిర్మాతగా మాత్రం కాదన్నట్టు గుమ్మడి చెప్పారు. దీని వెనుక కారణాలు ఆయన పేర్కొనలేదు. అయితే.. పెట్టుబడికి మాత్రం ఒప్పుకోలేదు. కానీ, తాను తీసుకునే వేతనం మాత్రం తగ్గించుకున్నారట.
అయితే.. ఆ సినిమాలో తను.. కొంత.. సూర్యకాంతం కొంత పెట్టుబడి పెట్టినట్టు రాసుకొచ్చారు. సూర్యకాంతం తల్లిగారి తరఫున లభించిన 50 ఎకరాల పొలంలో 10 ఎకరాలు అమ్మేసి.. సినిమాకు 5 లక్షలు సమకూర్చారట. అయితే.. సినిమా సూపర్ హిట్ అవడంతో.. ఆమెకు రెండు రెట్లు లాభాలు వచ్చాయని.. తనకు కూడా అంతే లాభం వచ్చిందని రాసుకొచ్చారు.