అన్నగారు ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని అనుకున్న వారు కాదు.. అనుకోని వారు ఎవరూ ఉండరు. ఆయ నతో కలిసి ఒక్క ఛాన్స్ కొట్టేసేందుకు నటీనటులు తహతహ లాడిపోయేవారు. అన్నగారితో వేషం అంటే.. ముందు వరుసలో ఉండేవారు. అయితే.. అందరికీ అన్నీ అందవుఅన్నట్టుగా.. కొందరికి.. అన్నగారితో కలిసి నటించే అవకాశం దక్కలేదు. వాస్తవానికి తెలుగు సినీ రంగంలోని అందరు హీరోయిన్లు కూడా.. అన్నగారితో కలిసి నటించిన వారే.
సావిత్రి నుంచి శ్రీదేవి వరకు.. వాణిశ్రీ నుంచి కాంచన వరకు.. జయసుధ నుంచి జయప్రద వరకు ఇలా.. అందరూ అన్నగారితో కలిసి డ్యాన్సులు చేసినవారే.. వెండితెరపై నటించిన వారే. అయితే.. ఒకే ఒక్క హీరోయిన్‌కు మాత్రం అన్నగారితో నటించే ఛాన్స్ దక్కలేదని అంటారు. ఆమే సుహాసిని! అన్నగారు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే.. సుహాసిని కూడా రంగంలో ఉన్నారు. అయితే.. ఆమెకు అన్నగారితో నటించాలని కోరిక ఉండేది. దీనికి సంబంధించి.. ఒకటిరెండు ఇంటర్వ్యూలలోనూ తన అభిప్రాయం పంచుకుంది.
అయితే.. అవకాశం మాత్రం చిక్కలేదు. అయితే.. 1983లో వచ్చిన..`స్వాతి` సినిమాలో క్యారెక్టర్ నటుడి పాత్ర కోసం.. అన్నగారిని సుహాసిని సంప్రదించిందని సినీ రంగంలో ఒక టాక్ నడిచింది. ఈ సినిమాలో శారద.. సుహాసిని (స్వాతి పాత్ర)కి తల్లిగా నటించింది. అయితే..వయసులోనే భర్తను కోల్పోయిన తన తల్లికి మళ్లీ పెళ్లి చేస్తుంది స్వాతి. శారద భర్తగా కొంగర జగ్గయ్య నటించారు. అయితే.. జగ్గయ్యపాత్రకు ఎన్టీఆర్‌ను తీసుకోవాలని.. దర్శకుడు క్రాంతి కుమార్ కూడా అనుకున్నారు.
కానీ, అనివార్య కారణాలతో అప్పటికే అన్నగారు పార్టీ పెట్టిన సమయంలో బిజీగా ఉండడంతో కుదరలేదు. ఇక, ఆ తర్వాత.. కూడా సుహాసిని అన్నగారితో ఎలాంటి పాత్రలోనూ నటించలేక పోయారు. అయితే.. స్వాతి చిత్రానికి గాను ఫిలిం ఫేర్ అవార్డు రావడం గమనార్హం. అయితే సుహాసిని ఎన్టీఆర్ తనయుడు బాలయ్యతో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల్లో నటించారు.