Moviesవాన సినిమా హీరోతో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయ‌ణం... అలాంటి ఫోటోలు బ‌య‌ట‌కు...

వాన సినిమా హీరోతో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయ‌ణం… అలాంటి ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో..?

కొంతమంది హీరోలు ఒకటి రెండు సినిమాలే చేసినా ప్రేక్షకులకు గుర్తుంది పోతారు.
అలాంటి హీరోల లిస్ట్ లో వాన సినిమా హీరో వినయ్ కూడా ఉన్నాడు. నిజానికి వినయ్ వాన సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ బేసిక్ గా తమిళ హీరో అయిన విజయ్ అక్కడే తన కాన్సంట్రేషన్ ను పెట్టాడు. అక్కడ కూడా చెప్పుకోదగ్గ సినిమాలు పడలేదు. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత వినయ్ మళ్లీ మళ్లీ విలన్ పాత్రలతో రీఎంట్రీ ఇచ్చాడు.

తమిళ తెలుగు భాషల్లో విలన్ గా ఆఫర్స్ అందుకున్నాడు. ఇక వాన సినిమాలో కనిపించినట్టే బయట కూడా రొమాంటిక్ అబ్బాయే. ప్రస్తుతం వినయ్ ఓ హీరోయిన్ తో పీకల్లోతు లవ్ లో ఉన్నట్టు టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విమలా రామన్. ఈ ముద్దుగుమ్మ కూడా ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోంది.

ఇండియ‌న్ అయినా ఆస్ట్రేలియాలో పెరిగిన విమ‌లా రామ‌న్ టాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో న‌టించింది. ఎక్స్‌పోజింగ్‌కు గేట్లు ఎత్తేసే విష‌యంలో విమ‌లా రామ‌న్ ముందు వ‌రుస‌లో ఉంటుంద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. వ‌య‌స్సు పై బ‌డుతున్నా రొమాంటిక్ ఫొటోలు, పోజులు ఇవ్వ‌డంలో ఆమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటూ వ‌స్తోంది.

ఇక ప్ర‌స్తుతం విమ‌ల – విన‌య్ ఇద్దరూ ఇప్పుడు ప్రేమలో మునిగిపోయారట. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి క్లోజ్ గా ఫోటో లు కూడా దిగారు. దాంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ కలిసి ఓ టూర్ కు వెళ్లగా అక్కడ దిగిన ఫోటోలే షేర్ చేశారు. దాంతో వాన సినిమా హీరోతో విమలా రామన్ లవ్ లో ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news