విజయలక్ష్మి అంటే ఎవ్వరికి తెలియదు… అదే సిల్క్ స్మిత పేరు చెపితే తెలుగు ప్రజలను, తెలుగు సినీ లవర్స్‌ను కొన్ని దశాబ్దాల పాటు తన అంద చందాలతో ఓ ఊపు ఊపేసింది. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో ఏకంగా 200లకు పైగా సినిమాలలో నటించి మెప్పించింది. అప్పట్లో హీరోయిన్ల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేంత క్రేజ్ ఈ సిల్క్‌ది. అలా 15 ఏళ్ల పాటు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ తెచ్చుకున్న సిల్క్ స్మిత ఎన్నో కోట్లు సంపాదించి వెనక్కు వేసుకుంది.
సిల్క్ స్మిత తన సంపాదన పెంచుకోవాలన్న ఆశతో నిర్మాతగా కూడా మారింది. అయితే ఆమె నిర్మాతగా చేసిన సినిమాలు ఎక్కువగా విజయం సాధించకపోవడంతో ఆమె ఆర్థికంగా నష్టపోయింది. ఇలా ఆమె సంపాదించిన సంపాదన క్రమక్రమంగా తరుగుతూ వచ్చింది. చివరకు ఆమె అనేక వ్యసనాలకు కూడా లోనైంది. చివర్లో ఆమె ఆస్తులు కరిగిపోవడంతో అప్పులు కూడా చేసింది.
సిల్క్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమెతో ఎంత సన్నిహితంగా ఉన్న స్టార్ హీరోలు కూడా ఆమెకు ఏనాడు సాయం చేయలేదు. చివరకు ఆమె ఎంతో ఇష్టంగా ప్రేమించిన ఓ స్టార్ హీరో సైతం ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు దూరం పెట్టేశాడు. ఇవన్నీ ఇలా ఉంటే ఆమె ఎంతో నమ్మిన ఓ నటుడు చివర్లో ఆమెను దారుణంగా మోసం చేశాడట. ఆమె మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆమెతో సంతకాలు చేయించుకుని ఆస్తులు అన్నీ రాయించుకున్నాడు.
అప్పటికే తాను అతడి చేతిలో మోసపోవడంతో కుమిలిపోయింది. చివరకు తాను సంపాదించిన ఆస్తుల్లో మిగిలిన ఆస్తులతో పాటు ఏలూరులో ఉన్న… కొన్ని ఆస్తులు తన కుటుంబ సభ్యుల పేరిట రాసి చనిపోయింది. తన ఆత్మహత్య లేఖలో కూడా తనను కొందరు మోసం చేశారని రాసి మరీ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆమెను మోసం చేసింది ఎవరో కాదు.. అప్పట్లో ఓ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండేవాడు.
స్మిత కెరీర్ ఫామ్‌లో ఉన్నప్పుడు మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆమె అతడిని నమ్మి తన ఆస్తిపాస్తుల వివరాలు మొత్తం చెప్పేసింది. ఆమెను అలా గుప్పెట్లోకి తెచ్చుకుని.. ఆమె మద్యం మత్తులో ఉండగా ఆమె ఆస్తులను తన పేరు మీద రాయించుకున్నాడు. అలా తాను మోసపోయానన్న విషయం స్మితకు చివర్లో కాని అర్థం కాలేదు. చివరకు అదే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపితమైంది.