యస్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..ఈ వార్త నిజమే అని తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏం మాయ చేసావే సినిమా టైంలోనే వీళ్ళిద్దరూ చూపులు కలిసాయి. ఆ తర్వాత మీరు మాటలు కలిసి.. ఆ మాటలు స్నేహంగా ..ఆ స్నేహం ప్రేమగా ..ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లేలా చేసుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ డెస్టినేషన్ అనుకోని కళ్ళు చెదిరే రేంజ్ లో ఇద్దరు మంగళ వాయిద్యాలు మధ్య ఒకటయ్యారు.
బోలెడన్ని ఆశలతో కొత్త కోరికలతో ఒక్కటైన ఈ జంట పట్టుమంటే పదికాలాలు కూడా 10 సంవత్సరాలు కూడా కలిసి కాపురం చేయకుండానే విడాకులు తీసుకొని అభిమానుల నోట్లు మట్టి కొట్టారు. అభిమానులు “మీరు ఎంచెక్క హ్యాపీగా పెళ్లి చేసుకోని.. సంతోషంగా ఉంటారు అనుకుంటే.. ఇలా మా గుండెలు బద్దలు కొట్టారు” అంటూ నాగచైతన్య సమంత పై విరుచుకుపడ్డ జనాలు. అయితే వీళ్ళు విడాకులు ప్రకటించి దాదాపు సంవత్సరం కావస్తుంది. అయినా కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో నాగచైతన్య సమంత ల విడాకులకు సంబంధించిన వార్త ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది . కాగా రీసెంట్ గా గౌతమ్ మీనన్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ అక్కినేని నాగచైతన్య సమంతలను కలిపేలా ఉన్నాయి అంటున్నారు సినీ జనాలు.
గౌతమ్ మీనన్ డైరెక్షన్లో నాగచైతన్య సమంత ఇద్దరు కలిసి చేసిన సినిమా “ఏం మాయ చేసావే”. నిజానికి ఈ సినిమానే వీళ్ళ ప్రేమకు పునాది. ఈ సినిమా ఇద్దరి కెరియర్ని మలుపు తిప్పే విధంగా హిట్ అయింది. కాగా ఈ ఏం మాయ చేసావే సినిమాకు సీక్వెల్ తీస్తాననిఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడు సమంత నాగచైతన్య పేర్లు ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గౌతం ఇప్పటికే సమంతతో మాట్లాడారని సమంత నాగచైతన్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉందని టాక్ వినిపిస్తుంది. గతంలో నాగచైతన్య కి ఇదే ప్రశ్న ఎదురైతే భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా అంటే..”ఆ టైం ప్రకారం నిర్ణయం తీసుకుంటానని ..నో అయితే చెప్పనని” నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా తెరపై మళ్ళీ నాగచైతన్య సమంతల జంట ట్రెండ్ సెట్ చేస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలోనే ఇద్దరు మీటైనా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం మాయ చేసావే 2 కి సంబంధించిన స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అవుతుందో..? మళ్లీ మనం ఇద్దరిని తెరపై ఎప్పుడు చూస్తామో..?