ఈ కాలంలో ప్రేమించి మోసం చేయడం సాధారణం అయిపోయింది. ఒకరిని ప్రేమించి అంతకంటే అందగాడు దొరికాడనో లేదంటే ఆస్తులు ఎక్కువ ఉన్నవాడు వచ్చాడనే కారణంతోనో అప్పటి వరకూ ప్రేమించిన వాడిని విడిచి పెడతారు. ఇక సినిమా సెలబ్రెటీల విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎవరితో ప్రేమలో ఉంటారో ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో తెలియదు. అంతే కాదు పెళ్లి చేసుకుని ఏడాదిలోపే విడిపోయిన సెలబ్రెటీలు కూడా ఉన్నారు.
కానీ ఒకప్పటి స్టార్ హీరోయిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడింది. కోటీశ్వరుల సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసి అతడినే పెళ్లి చేసుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల తార రాశి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన రాశి ఆ తరవాత హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తరవాత రాశి తన అందంతో ప్రేక్షకుల మతిపోగొట్టింది. సుట్టబుగ్గలు స్వచ్చమైన నవ్వుతో కుర్రాళ్ల గుండెలను పిండేసింది. దాంతో రాశి క్రేజ్ ఓ రేంజ్ కు వెళ్లిపోయింది.
అప్పట్లో హీరోలు రాశి డేట్ ల కోసం వేచి చూశారు అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక రాశి హీరోయిన్ గా సక్సెస్ అయ్యిన తరవాత చేతి నిండి డబ్బులు సంపాదించింది. ఆ డబ్బుతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి సినిమాలను నిర్మించింది. కానీ కథల ఎంపికలో తడబడటం వల్ల నిర్మాతగా నష్టపోయింది. ఇక రాశి తన తండ్రి మరణం తరవాత విషాదంలోకి వెళ్లిపోయింది. అయితే ఆ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీముని ఆమెకు ధైర్యం చెబుతూ బాగోగులు చూసుకున్నారట.
అతడి కేరింగ్ కు పడిపోయిన రాశి అతడితో ప్రేమలో పడింది. కాగా రాశి ని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో బడా వ్యాపావేత్తలు ఎన్ఆర్ఐ లు సైతం ఆసక్తి చూపించారు. కానీ రాశి మాత్రం తనకు తోడుగా ఉన్న శ్రీమునినే పెళ్లి చేసుకుంది. అంతే కాదు అతడితో పెళ్లి తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి గృహిణిగా మారిపోయింది. ఇక ప్రస్తుతం రీఎంట్రీ ఇచ్చిన రాశి సీరియల్స్ లో తల్లి పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.