రష్మిక మందన్నా ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే కన్నడ పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ ల లిస్టు లోకి యాడ్ అయింది. అంతేకాదు ఎవరు ఊహించిన విధంగా మొదటి సినిమాకి మూడవ సినిమాకి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచేసి దానికి తగ్గ పెర్ఫార్మన్స్ ఇస్తూ ..అనతి కాలంలోనే తెలుగు ,తమిళ్, హిందీ లాంగ్వేజ్ లో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరింది.
అంతేకాదు ప్రజెంట్ రష్మిక సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. కాగా రష్మిక మందన్నా మొదటి నటించిన పాన్ ఇండియా సినిమా “పుష్ప”. ఈ సినిమాలో బన్నీ నటనకు నాచురల్ యాక్టింగ్ కు ఎన్ని మార్కులు పడ్డాయో ..అదే విధంగా శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నకు కూడా అన్నే మార్కులు పడ్డాయి . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో “నా సామి సామి “అంటూ నడుము తిప్పేసి వేసిన స్టెప్స్ కు కూర ఫిదా అయ్యారు.
అంతవరకు బాగానే ఉన్నా ఆ మూమెంట్లో సినిమా హిట్ అవ్వాలని రష్మిక బాడీని గిరగిరా తిప్పేస్తే స్టెప్పులు వేసింది. ఇప్పుడు అమ్మడు ఆరోగ్య పరిస్థితి బాగోలేక హాస్పిటల్ కి వెళ్లే వరకు తెచ్చుకున్నింది. సామీ సామి పాటలు స్టెప్స్ వేసిన కారణంగా మోకాళ్లు నొప్పులు వచ్చాయంటూ ఆమె హాస్పిటల్ కి వెళ్ళింది.
ఇదే విషయాన్ని డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ..”నువ్వు సామీ సామీ అంటూ మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చేయడం వల్ల మీకు ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి ” అంటూ కామెడీగా స్పందించారు . అంతేకాదు త్వరలోనే బన్నీ కూడా షోల్డర్ పెయిన్ తో నా దగ్గరికి వస్తాడేమో “అంటూ సరదాగా ఫేస్బుక్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో డాక్టర్ ఏవి గురవారెడ్డి పోస్ట్ వైరల్ గా మారింది.