బ్రహ్మాస్త్ర.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అంతకుముందు బ్రహ్మాస్త్ర అంటే పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. తెలుసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూయించేవారు కారు. కానీ రణబీర్ కపూర్ పుణ్యమా అంటూ ఇప్పుడు బ్రహ్మాస్త్రలోని ఇంపార్టెంట్ విషయాలని.. అసలు బ్రహ్మాస్త్రం అంటే ఏంటి అనే సంగతి పై మనం తెలుసుకోబోతున్నాం. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా గ్రాండ్ ఫా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్నారు బ్రహ్మాస్త్రం మూవీ టీం. బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న గ్రాండ్ గా థియేటర్ లో రిలీజ్ కానుంది . ఈ సినిమాకి మెయిన్ పాయింట్ స్టార్ లెజెండ్రీ బాలీవుడ్ యాక్టర్ అమితాబచ్చన్, టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున ..ఇద్దరు సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో నటించి మెప్పించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ అన్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.
దీంతో సినిమాపై మరిన్ని హైప్స్ క్రియేట్ అయ్యాయి. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ కపూర్, అలియా భట్ క్షణం కూడా తీరిక లేకుండా బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్నారు . కడుపుతో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయిన ఆలియా.. ఈ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు . కాగా రీసెంట్ గా రణబీర్ కపూర్ ఓ పెద్ద మొక్కే మొక్కారట. ఈ సినిమా హిట్ అయితే ఏకంగా తిరుమల శ్రీవారికి తన తలనీలాలను ఇస్తానని మొక్కుకున్నారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓ పెద్ద స్టార్ హీరో ఇలాంటి మొక్కు మొక్కారు అంటేనే ఆశ్చర్యంగా ఉందంటున్నారు జనాలు.