Moviesబిగ్ బాస్: అందరు రేవంత్ ని టార్గెట్ చేయ్యండి అని చెప్పింది...

బిగ్ బాస్: అందరు రేవంత్ ని టార్గెట్ చేయ్యండి అని చెప్పింది ఆయనేనా..ఇదే ట్వీస్ట్ రా బాబు..!?

బిగ్ బాస్ షో చూసేవాళ్ళకి బాగా నచ్చే అంశం ఎలిమినేషన్. ఎందుకంటే వారం మొత్తంలో ఏం తప్పుడు పనులు చేశారు ..ఎవరిని ఎలా టార్గెట్ చేయాలి? ఎవరిని ఏ సాకు చెప్పి బయటకు పంపించాలి.. ఎవరు బయటకు వెళ్ళిపోతే మనం ఎక్కువ కాలం హౌస్ లో ఉండచ్చు తద్వారా రెమ్యూనరేషన్ అందుకోవచ్చు ..అనే కన్నింగ్ మైండ్ సెట్ తో ఆలోచించే జనాల మనసులు మొత్తం ఎలిమినేషన్ రోజే బయటపడతాయి.. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే అందరిలో ఓ చంద్రముఖి దూరుతుంది. అప్పటివరకు బాగానే ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తమ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన.. బయట పరిచయం ఉన్న వ్యక్తులను కూడా నామినేట్ చేస్తారు.

అది కరెక్ట్ రీజన్ తో కాదు పరమ చెత్త రీజన్ తో.. దీంతో బిగ్ బాస్ కి హైలైట్ గా నిలుస్తుంది ఈ నామినేషన్ ప్రక్రియ. పైగా ఆ టైంలో బిగ్ బాస్ మాట్లాడే తీరు ప్వ్ట్టే కండిషన్స్ వామ్మో అభిమానులకు బీపీలు పెంచేస్తాయి. కాగా బిగ్ బాస్ లో మొదటి వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. హౌస్ లో ఎంతో మంది కంటెస్టెంట్లు ఉండగా అందరూ సింగర్ రేవంత్ ని టార్గెట్ చేయడం షో చూస్తున్న వాళ్లకి ఆశ్చర్యకరంగా అనిపించింది . నిజానికి రేవంత్ వాళ్ళ చెప్పిన పాయింట్స్ కి అర్హుడు కాదు ..ఆయన పాయింట్ ని ఆయన క్లియర్ గా వినిపించే సత్తా ఉన్న బిగ్ బాస్ కాంటెస్టెంట్ అని సోషల్ మీడియాలో అభిమానలు చెప్తున్నారు.

ఇలా అందరూ ఆయనని నామినేట్ చేయడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు. కాగా దీనికి మెయిన్ రీజన్ బిగ్ బాస్ అని తెలుస్తుంది. మనకు తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే ముందు కంటెస్టెంట్లని ని క్వాంటైన్ చేస్తారు. ఆ టైంలో పలువురు వాళ్ళతో చర్చిస్తారు. బిగ్ బాస్ లో మీరు ఎలా ఉండాలి..? ఏం చేస్తే ఎక్కువకాలం బిగ్ బాస్ లో ఉంటారు..? అనే విషయాలపై మాట్లాడుకుంటారట . ఈ క్రమంలోనే అందరికీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ లో ఒకరైన వ్యక్తి సింగర్ రేవంత్ ని టార్గెట్ చేస్తే మీకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ కనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడట. అంతేకాదు హౌస్ లో ఉన్న వాళ్ళల్లా అందరిలో కల్లా సింగర్ రేవంత్ , ఫైమా నే అందరికీ తెలిసిన వాళ్ళు. అందుకే బిగ్ బాస్ వాళ్ళిద్దరి మధ్య చిచ్చుపెట్టారు. ఖచ్చితంగా వాళ్ళ నామినేషన్ లోకి వస్తే ఓట్లు ఎక్కువ పడతాయి తద్వారా షోకి పాపులారిటీ పెరుగుతుందని పిచ్చి నమ్మకంతో రేవంత్నినామినేట్ చేశారు బిగ్ బాస్ అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news