నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. అప్పట్లో భానుప్రియ, సుహాసిని, విజయశాంతి, రాధ, రజనీ ఇలా ఎంతో మంది క్రేజీ హీరోయిన్లు బాలయ్యతో ఆడిపాడారు. ఆ తర్వాత తరంలో రంభ, రోజా, రమ్యకృష్ణ, ఆమని, మీనా లాంటి వాళ్లు కూడా బాలయ్యకు బాగా సెట్ అయ్యారు. ఆ తర్వాత సంఘవి, సిమ్రాన్ లాంటి వాళ్లు బాలయ్యకు కలిసి వస్తే… చివర్లో నయనతార కూడా బాలయ్యకు జోడీగా బాగా సెట్ అయ్యింది.
ఇక సీనియర్ నటి రాధ – బాలయ్య కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో నిప్పులాంటి మనిషి – ముద్దుల కృష్ణయ్య – కలియుగ కృష్ణుడు – రాముడు భీముడు సినిమాలు వచ్చాయి. అలా రాధకు బాలయ్యకు మంచి స్నేహయే ఉండేది. ఇంకా చెప్పాలంటే మరీ అంత గొప్ప సినిమాలు వీరి కాంబినేషన్లో రాకపోయినా వీరు మంచి స్నేహితులుగానే ఉండేవారు.
సినిమాలకు దూరమయ్యాక పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో ఆమె సెటిల్ అయిపోయింది. రాధ కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు కార్తీక, తులసితో పాటు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. రాధ తన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్లుగా సెటిల్ చేసేందుకు చాలా కష్టపడింది. పెద్ద కుమార్తె కార్తీకకు తమిళంలో కో ( తెలుగులో రంగం) సినిమాయే పెద్ద హిట్.
రెండో కుమార్తె తులసి మణిరత్నం కడలి సినిమాతో హీరోయిన్ అయినా ఆ తర్వాత ఆమె నటనలో ఇంఫ్రూవ్ కాలేక తెరమరుగు అయ్యింది. ఇక కార్తీకను తెలుగులో గొప్ప హీరోయిన్‌గా నిలబెట్టాలని రాధే విశ్వప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్‌ను మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని స్వయంగా రిక్వెస్ట్ చేసిందట. రాధే స్వయంగా అడగడంతో జూనియర్ కూడా కాదనకుండా దమ్ము సినిమాలో కార్తీకను స్వయంగా రికమెండ్ చేశాడని అంటారు.
ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా కార్తీక, త్రిష నటించారు. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. హీరోయిన్లు కూడా మైనస్ అయ్యారని టాక్ వచ్చింది. దీనికి తోడు కార్తీక ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా సరిగా లేదన్న టాక్ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు ఛాన్సులు రాలేదు. చివరకు అల్లరి నరేష్‌కు సిస్టర్ రోల్ చేసినా కూడా తెలుగులో ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు.