యంగ్ హీరో నాగశౌర్యకు ఛలో తర్వాత ఆ రేంజ్‌లో హిట్ అయితే పడలేదు. దాదాపుగా నాలుగేళ్లుగా సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న శౌర్య తాజాగా తన సొంత బ్యానర్లోనే కృష్ణ వ్రింద విహారి రేపు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. సినిమాకు అయితే రిలీజ్‌కు ముందే పాజిటివ్ వైబ్స్ కనపడుతున్నాయి. రొమాంటిక్ కామెడీ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో గోవాలోని డామన్‌లో పుట్టి న్యూజిలాండ్‌లో పాపులర్ సింగర్ అయిన షెర్లీ సేటియా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
బాలీవుడ్‌లో మస్కా నికమ్మా లాంటి సినిమాలతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ సినిమాను నిర్మించారు. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆగ్రహారంలో ఉండే ఓ బ్రాహ్మణ యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుంటాడు. అక్కడ పరిచయం అయిన వ్రిందను లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత వీరిద్దరి జీవితాలు ? ఎలా మలుపులు తిరిగాయన్నదే ఈ సినిమా స్టోరీ.
కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు ప్రజెంట్ చేశాడని టీజర్లు, ట్రైలర్లే చెపుతున్నాయి. కథ, కథనాలపై నమ్మకంతోనే శౌర్య ఈ సినిమాను సొంతంగా నిర్మించాడు. మూవీ ప్రమోషన్స్‌కోసం ఏపీలో చేసిన పాదయాత్ర సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఇక బుక్ మై షోలో కూడా సినిమాకు పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ఇప్పటికే లక్ష లైకులు వచ్చచేశాయి. ఫస్ట్ డే హిట్ టాక్ వస్తే సినిమా మరో ఛలో అయిపోయినట్టే..!
ఇక హీరో నాగశౌర్య కూడా ప్రి రిలీజ్ ఈవెంట్లో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని… ఈ సినిమా కోసం నిర్మాతలుగా మా అమ్మ, నాన్న కూడా ఎంతో కష్టపడ్డారు అంటూ కాస్త ఎమోషనే అయ్యాడు. సినిమా చాలా బాగా వచ్చిందన్న నమ్మకంతో ఉన్నానని.. మీరు కూడా నన్ను నమ్మి రావాలని.. మీ నమ్మకాన్ని నిలబెడతానని చాలా కాన్ఫిడెంట్‌గానే చెప్పాడు.
శౌర్య మాటలు చూస్తేనే సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాడని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సెన్సార్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వినపడుతోంది. యూ / ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న విహారి రన్ టైం 2 గంటల 19 నిమిషాలు. అంటే ఓవరాల్‌గా 139 నిమిషాలతో థియేటర్లలోకి వస్తోంది. రాధికా శరత్ కుమార్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక టెక్నికల్‌గా చూస్తే మహతి స్వర సాగర్ సంగీతం – సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.