Moviesశోభిత అందానికి నాగ చైతన్య టెంప్ట్.. పబ్లిక్ గానే అలా చేసాడు...

శోభిత అందానికి నాగ చైతన్య టెంప్ట్.. పబ్లిక్ గానే అలా చేసాడు ఏంట్రా బాబు..!?

సోషల్ మీడియాలో గాసిప్లు రూమర్లు చాలా కామన్. ప్రతిరోజు కొన్ని వేల రూమర్స్ స్టార్స్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా గత కొన్ని రోజుల నుంచి స్టార్ హీరో నాగచైతన్య పై ఓ రూమర్ గట్టిగా ప్రచారం జరుగుతుంది . అదే హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య ప్రేమాయణం సాగిస్తున్నారని ..బాలీవుడ్ మీడియా అయితే రేంజ్ లో వార్తలు రాస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే శోభిత ధూళిపాల ఫైర్ అవుతూ మిడిల్ ఫింగర్ చూపించిన విషయం తెలిసిందే.

అయితే నాగచైతన్య శోభిత మధ్య ప్రేమ ఉంది అని తెలియజేసేలా నాగచైతన్య చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే శోభిత దూళిపాళ్ల తెలుగు అమ్మాయి. కెరియర్ మొదట్లో కొన్ని సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆమె గూడచారి, మేజర్ చిత్రాలతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం శోభిత మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న పోనియన్ సెల్వన్ సినిమాల్లో ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది.

చోళుల కాలం నాటి కథ కాబట్టి శోభిత యువరాణి గెటప్ లో ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు మోడ్రెన్ లుక్స్ లో చూసిన ఎవరైనా సరే..ఇలా శోభిత ను చూస్తే ఫిదా అవ్వాల్సిందే .బహుశా నాగచైతన్య కూడా తన అందానికి ఫిదా అయిన్నట్లు ఉన్నాడు. అందుకే ఆమె ఫోటోకి లైక్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ చేస్తుంది బాలీవుడ్ మీడియా.

అయితే నాగచైతన్య సోషల్ మీడియాలో సోషల్ మీడియాకి దూరంగా ఉంటారని సంగతి తెలిసిందే. ఆయన సినిమా ప్రమోషన్స్ తప్పిస్తే మిగతా సినిమా ప్రమోషన్స్ కానీ మిగతా వాళ్ళ ఫొటోస్ కి లైక్ చేయడం కానీ చేయరు. అలాంటిది శోభిత ధూళిపాల ఫోటోకి లైక్ చేయడంతో వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి నాగచైతన్య దినికి ఆన్సర్ ఏం ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news