హీరోయిన్ పూర్ణ ఈ పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ తన అంద చందాలతో మెప్పిస్తూ కుర్రాళ్లను ఉత్సాహపరుస్తూ వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. కెరియర్ మొదట్లో హిట్ల కోసం చాలా తంటాలు పడింది. అవును సిరీస్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న పూర్ణ సీమటపాకాయ్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయింది. కానీ అనుకున్నంత స్థాయి గుర్తింపు రాకపోవడంతో కొన్నాళ్లు కెరియర్ కష్టాల్లో కొట్టుమిట్టాడింది.
ఇక ఆ తర్వాత బుల్లితెరపై ..”డీ, జబర్దస్త్” షోస్ కీ జడ్జ్ గా చేస్తూ బాగా పాపులర్ అయింది. మనకు తెలిసిందే బుల్లితెర డాన్స్ షో ఢీ ప్రోగ్రాంలో పూర్ణ చేసిన అల్లరి సందడి అంతా ఇంత కాదు . ఎవరైనా నచ్చితే టక్కున బుగ్గ కొరికేస్తుంది.. పబ్లిక్ గానే ఇలా చేయడం చాలా మంది జనాలు చూసి నవ్వుకున్నారు. ఆ తర్వాత అది ఆమె ప్రేమ అని తెలుసుకొని కామ్ గా అయిపోయారు . అయితే రీసెంట్ గా ఈ అమ్మడికి కాబోయే భర్తకు ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన చెప్పిన ఆన్సర్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ప్రముఖ బిజినెస్ మ్యాన్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకొని తన కాబోయే భర్త ఫోటో ని అఫీషియల్ గా రివీల్ చేసింది . పూర్ణకు కాబోయే భర్త ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ ..అంతేకాదు గోల్డెన్ వీసాలు కూడా మన ఇండస్ట్రీలో హీరోయిన్లకి ఇప్పించారు . తెలుగు వారు పూర్ణ గురించి ప్రశ్నించగా ..”ఆమె ఢీ షోలో ఇలా పరాయి మగాడిని కొరికేస్తుంది కదా దానిపై మీ అభిప్రాయం..” అనగా..” తన వ్యక్తిగతం అది.. తన సినీ కెరియర్ కి నేను ఎప్పుడు అడ్డు రాను “అంటూ చెప్పుకొచ్చాడట. అంతేకాదు తను పెళ్లి తర్వాత కూడా అలా చేసినా నాకు ఏమి ప్రాబ్లం లేదు. పూర్ణ ఎలాంటిదో నాకు బాగా తెలుసు అంటూ పూర్ణాన్ని పెళ్లికి ముందే ఓ రేంజ్ లో పొగిడేసాడట. దీంతో పూర్ణ చాలా లక్కీ అంటున్నారు సినీ ప్రముఖులు. అంతేకాదు పూర్ణ కాబోయే భర్త మంచి మనసు అర్థం చేసుకొని నీలాంటి భర్త అందరికి రావాలి అంటూ కోరుకుంటున్నారు.