సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం పెద్ద గొప్ప విషయం కాదు ..వచ్చిన హీరోయిన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ..ఆ ఆఫర్లను మంచిగా వాడుకుంటూ ..స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిన తర్వాత కూడా అలాంటి పేరుని ఉంచుకోవడం గొప్ప విషయం. ఇలా చాలా తక్కువ మంది హీరోయిన్స్ చేస్తారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఒక సినిమా హిట్ కొట్టిన హీరోయిన్స్ మిగతా రెండు సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ..ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సుందరీమణులు ఎంతోమంది ఉన్నారు.
అయితే టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే వాళ్ళందరిలోకి ప్రత్యేకం. దాదాపు ఒక్క సినిమా హిట్ కోసం ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి బోలెడన్ని ప్లాపు తన ఖాతాలో వేసుకొని నానా తంటాలు పడి అలా తన ఖాతాలో ఓ హిట్ ను వేసుకుంది . ఇక అంతే ఆ సినిమా హిట్ నుంచి పూజా కెరియర్ తిరుగులేకుండా దూసుకుపోతుంది. అయితే రీసెంట్గా పూజ హెగ్డే కెరియర్ లో మూడు బడా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. దీంతో పూజ హెగ్డేను మళ్ళీ ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ క్రమంలోనే పూజ హెగ్డే మైనస్ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేలా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పూజా హెగ్డే ముక్కు గురించి కొందరు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజ హెగ్డే ముక్కు సరిగా లేదని ఆమె ముఖానికి అదే మైనస్ అని చెప్పుకొచ్చారు. దీంతో హర్ట్ అయిన పూజా హెగ్డే తన ముక్కుకి సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయిందట . ఇదే విషయం ప్రజెంట్ బాలీవుడ్ లో టాప్ టృఎండింగ్ లో దూసుకుపోతుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సర్జరీ చేయించుకోవడం కొత్త విషయం ఏం కాదు . ఇప్పటికే బోలెడు మంది హీరోయిన్స్ బోలెడన్ని పార్ట్ లకు సర్జరీ చేయించుకున్నారు . మరి చూడాలి సర్జరీ తర్వాత బుట్ట బొమ్మ ముక్కు ఏ విధంగా తయారవుతుందో..?