ఈ మధ్యకాలంలో సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోట్లు కోట్లు పోసి సినిమాలు తీస్తున్న లాభాలు దక్కించుకోలేకపోతున్నారు నిర్మాతలు. దానికి రీజన్స్ ఏవైనా కానీ నష్టపోయేది మాత్రం కచ్చితంగా ప్రొడ్యూసర్స్. సినిమా కోసం అని చెప్పి తమ ఆస్తులని ప్రాపర్టీస్ ని అమ్మి మరీ సినిమాలు తీస్తుంటే ..సినిమాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోని సరికొత్త ఫార్ములా అని ఇంట్రడ్యూస్ చేశాడు మహేష్ బాబు. ఈ ప్రాసెస్ నిజంగానే సూపర్ అని చెప్పాలి . అభిమానులకి కొత్త ఫీలింగ్ ప్రొడ్యూసర్లకు నో నష్టాలు
మనకు తెలిసిందే ఒక్కప్పటి సినిమా ఫీల్డ్ వేరు ఇప్పటి ఫీల్డ్ వేరు.. ఒకప్పుడు సినిమా రెమ్యూనరేషన్ వేరు ఇప్పుడు నటుల తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వేరు. కచ్చితంగా పిండి కొద్దీ రొట్టెనే అంటారు. అయితే రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకుంటున్న హీరోలు దానికి తగ్గ హిట్టునైతే ఇవ్వలేకపోతున్నారు . ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన పాత సినిమాలను మళ్లీ కొత్తగా 4క్ లో బెటర్ విజువల్స్ తో రిలీజ్ చేసి సంచలనానికి తెర తీసాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన పాత సినిమాలు రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అయ్యాడు. దాంతో ఇదే ఫార్ములా ను ఇప్పుడు ఫాలో అవుతున్నారు యంగ్ హీరో ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన తమ్ముడు , జల్సా సినిమాలను ఈ మధ్యనే 4క్ లో బెటర్ విజువల్ ఎఫెక్ట్స్ చూసి అభిమానులు థ్రిల్ అయిపోయారు. 2008 ఏప్రిల్ 2న రిలీజ్ అయిన జల్సా సినిమా ను రిలీజ్ చేసి దాదాపు మూడున్నర కోట్లు కలెక్ట్ చేసిందంటే .. జనాలకు ఆ సినిమా ఎంత నచ్చేసింది అర్థం చేసుకోవచ్చు. ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి. కాగా మహేష్ బాబు బర్తడే కి సూపర్ హిట్ మూవీ అయిన పోకిరిని వరల్డ్ వైడ్ గా 500 కు పైగా షోలతో.. అమెరికాలో 50 కి పైగా షోలతో రిలీజ్ చేయగా దాదాపు కోటున్నర పైనే కలెక్ట్ చేసి మరో సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇక ఇప్పుడు అదే ఫార్ములా ని ఫాలో అవుతున్నాడు యంగ్ రెబల్ హీరో ప్రభాస్ ఆయన తన బర్తడే రోజున ఆయన కెరియర్ లోని క్లాసిక్ గా నిలిచిన బిల్లా సినిమాను రిలీజ్ చేయబోతున్నాడట. అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా మిర్చి మూవీ కూడా రిలీజ్ చేయబోతున్నాడట. ఇలా సరికొత్త ఫార్ములా అని ఇంట్రడ్యూస్ చేశాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు . మరి చూడాలి ఈ లిస్టులోకి ఇంకెంత మంది టాలీవుడ్ హీరోలు యాడ్ అవుతారో..?