నందమూరి నటసింహం బాలకృష్ణ సేవాభావం గురించి తెలిసిందే. ఆయన రాజకీయాలు, సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా సేవా కార్యక్రమాల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. తన తల్లి బసవతారక పేరిట స్థాపించిన హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మంది క్యాన్సర్ పేషెంట్లకు అద్భుతమైన ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భారతదేశంలోని పేరొందిన క్యాన్సర్ ఆసుపత్రుల సరసన చోటు దక్కింది అంటే అందుకు బాలకృష్ణతో పాటు ఆ ఆసుపత్రి వైద్య బృందం అందిస్తున్న అద్భుతమైన వైద్యసేవలే అని చెప్పాలి. ఇక బాలయ్య మనసు ఎంత వెన్నో చెప్పక్కర్లేదు. ఆయన ఎవరైనా ఆపదలో ఉంటే తక్షణమే స్పందించి సాయం చేస్తూ ఉంటారు. తాజాగా బాలయ్య లోని ఉదార స్వభావం మరోసారి తెరపైకి వచ్చింది. బాలకృష్ణ తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా సమయంలో బాలయ్య అక్కడ ఎంతోమందిని ఆదుకున్నారు.
అలాగే హిందూపురం ఏరియా ఆసుపత్రి వైద్యులు కరోనా సమయంలో చేసిన సేవలకు గాను బాలయ్య వారికి ఎంతో అండగా నిలబడ్డారు. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పేదల ఆకలి తీర్చేందుకు అన్నకేంటిన్ ఏర్పాటు చేశారు. ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటుచేసి వంద రోజులు పూర్తయింది. పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం స్పెషల్‌గా నాన్ వెజ్ మీల్స్ అందిస్తున్నారు.
పేదల కోసం ప్రత్యేకంగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా పంచి పెడుతున్నారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా జై బాలయ్య జై బాలయ్య అని అరుస్తూ బాలయ్య పై ప్రత్యేకమైన అభిమానం చాటుకుంటున్నారు. ఈ వీడియోతో పాటు.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వస్తున్న తన 107వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.