Moviesఆ స్టార్ క్రికెటర్ తో నిధి అగర్వాల్ లవ్ ఎఫైర్...?

ఆ స్టార్ క్రికెటర్ తో నిధి అగర్వాల్ లవ్ ఎఫైర్…?

ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న హీరోయిన్ల‌లో నిధి అగర్వాల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కు యూత్ లో తెగ ఫాలోయింగ్ ఉంది. బొద్దుగా కనిపిస్తూ హాట్ పోజులతో సోషల్ మీడియాలో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. బాలీవుడ్ నుండి వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది. ఇంత‌కు నిధి కూడా హైద‌రాబాదీ అమ్మాయే. హైద‌రాబాద్‌లో సెటిల్ అయిన మార్వాడీ కుటుంబంలో నిధి జ‌న్మించింది. ఆ త‌ర్వాత మోడ‌లింగ్‌లో స‌క్సెస్ అయ్యి హీరోయిన్ అయ్యింది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో నిధి అగర్వాల్ క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా తరవాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది. అంతే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి ఛాన్స్ లు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ కు జోడిగా హరి హర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గనక హిట్ అయితే నిధి వరుస గా స్టార్స్ కు జోడిగా నటించిన అవకాశం కూడా అందుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ ఓ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు గా బాలీవుడ్ మీడియా లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ స్టార్ క్రికెటర్ మరెవరో కాదు కే ఎల్ రాహుల్. వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలం గా కే ఎల్ రాహుల్ నిధి అగర్వాల్ తో డేటింగ్ చేస్తున్నాడు అని కూడా ఇండస్ట్రీ లో టాక్ ఉంది. అయితే ఇదే విషయం పై మీడియా ప్రశ్నించగా తాము స్నేహితులం మాత్రమే అంటూ ఆ వార్తల్ని కొట్టి పారేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news