టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అలా వచ్చి ఇలా అడ్రస్ కేకుండా పోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నేహ శర్మ కూడా ఒకరు. పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్ అంటే అయితే స్టార్ హీరోయిన్ అవుతుంది. లేదంటే అడ్రస్ లేకుండా పోతుంది. పూరి పరిచయం చేసి ఇండస్ట్రీలో అవకాశాలు లేక కనుమరుగైన వారిలో నేహ శర్మ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేసిన సినిమా చిరుత. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాతో నేహ శర్మ టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమా కాబట్టి చరణ్ సరసన మరీ అంత అందంగా ఉండే అమ్మాయిని తీసుకోలేదనే కామెంట్స్ వినిపించాయి. అప్పట్లో నేహ పెద్దగా ఎవరికీ నచ్చలేదు. అందాలు ఆరబోసినా పెద్దగా ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. పూరి కొంతవరకు తన స్టైల్లో అమ్మాయిని బాగానే చూపించే ప్రయత్నం చేశాడు. అయితే, చిరుత కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాలేదు. దీనికి ఉన్న కారణాలలో హీరోయిన్గా నటించిన నేహ శర్మ కూడా ఒకటి అనుకున్నారు.
ఇక ఈ సినిమా ఫ్లాపైనా కుర్రాడు అనే సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం అందుకుంది నేహ శర్మ. వరుణ్ సందేశ్ ఈ సినిమాలో హీరో. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్లో వెళ్ళి సినిమాలు చేసుకుంది. ఆ తర్వాత తమిళ, మలయాళ భాషలలో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం మళ్ళీ మూడవ సినిమా ఛాన్స్ రాలేదు. దీనికి కారణం అప్పట్లో బలంగా వినిపించిందీ ఏంటంటే చిరుత సినిమా షూటింగ్ సమయంలో చరణ్ – నేహ లవ్‌లో పడ్డారని.
దీనికి ఒప్పుకోని మెగా ఫ్యామిలీ, నేహకి తెలుగులో అవకాశాలు రాకుండా చేశారని వార్తలు వినిపించాయి. అయితే, ఇది నిజం కాదని మళ్ళీ కొంతకాలానికి ప్రచారం జరిగింది. నిజంగా లవ్‌లో ఉంటే ఆపేదెవరు..? ఇవన్నీ గాసిప్ రాయుళ్ళు క్రియేట్ చేసిన న్యూస్ మాత్రమేనట. నేహ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడం వల్లే మళ్ళీ ఇక్కడ హీరోయిన్గా తనకి ఛాన్సులు రాలేదు.
అంతే తప్ప చరణ్‌తో లవ్‌లో పడటం..దాని వల్ల ఎవరో ఆమెని ఇక్కడ్నుంచీ తరిమేయడం లాంటివన్నీ కేవలం కల్పించి రాసిన రాతలే అని తర్వాత క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పటికీ హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ నెటిజన్స్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నది మనం చూస్తూనే ఉన్నాము. అమ్మడు సోషల్ మీడియాను అస్సలు వదలడం లేదు.