రాను రాను ప్రస్తుతం జనరేషన్ మరీ పిచ్చిగా తయారవుతుంది .ఎస్ ఈ మాట అనాల్సిందే .లేకపోతే మొగుడు వద్దు సెక్స్ వద్దు కానీ పిల్లలు కావాలంటా ఈ హీరోయిన్ కి.. ఈ మాటలు విన్న ఎవ్వరైనా ఏమనుకుంటారు ..ఈ పిల్లకు పిచ్చి పట్టిందిరా అనుకోరు . ప్రజెంట్ ఇదే విషయంలో ట్రోలింగ్ గురవుతుంది సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఒకప్పుడు అంటే ఈ పేరుకి పరిచయం అవసరం కానీ ఇప్పుడు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే తనదైన నటనతో స్టైల్ తో తెలుగు కుర్రాలని కట్టిపడేసిన అమ్మాయి.
రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్.. అందాల గురించి ప్రత్యేకమైన పరిచయం చేయాల్సిన పనిలేదు. సీతారామం సినిమా చూసిన అందరూ అమ్మడుకి బిగ్ ఫ్యాన్స్ అయిపోయారు. ఆ కట్టు ఆ బొట్టు ఆ పద్ధతి అబ్బో నిజంగానే సీత లాగ అనిపించింది అంత చక్కగా ఉంది. అయితే ఈ సీత నోటి నుండి ఊహించని మాటలు వినాల్సి వచ్చింది. అదే ఇప్పటి జనాలకు బాధగా ఉంది.
రీసెంట్ గా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ “డేటింగ్ దిస్ నైట్స్” ఎపిసోడ్ లో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ..” 30 ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు డేటింగ్ చేయడం.. ప్రేమలో పడటం పిల్లల్ని కనడం వల్ల చాలా స్ట్రెస్ కి లోనవుతారట.. ఆ ఒత్తిడి నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. పాత చింతకాయ పచ్చడిలా నేను ఉండను.. అలాగని ఈతరం అమ్మాయిలలా ఫాస్ట్ ఫాస్ట్ జనరేషన్ తగ్గట్టు ఉండను . నాకు నచ్చింది నేను చేస్తూ ఉంటాను. అంతే కాదు ప్రస్తుతం మన చుట్టూ చాలా అభద్రతాభావం ఉంది.
కాబట్టి నాకు కావాల్సిందల్లా ప్రొటెక్టెడ్ పర్సన్ అంతే. అయితే నాకు మాత్రం అమ్మ అని పిలిపించుకోవాలని ఉంది. ఓ బిడ్డను కనాలి అని ఉంది. కానీ నాకు మొగుడు , సెక్స్ కూడా వద్దు ఒంటరి తల్లిగా ఉండాలని కోరుకుంటున్నాను.. దానికి మా అమ్మ సరే అని చెప్పడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది ..నిజంగా ఇది నాకు చాలా అద్భుతమైనది అని నేను అనుకుంటున్నాను” అని చెప్పింది. అయితే మృణాల్ చేసిన కామెంట్స్ పైన నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. “మొగుడు వద్దు సెక్స్ వద్దు ..మరి పిల్ల ఎలా పుడతారు.. నువ్వే చెప్పు..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.