Moviesమెగా ఫ్యామిలీకి గుంటూరు భ‌యం ప‌ట్టుకుందా... ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి...!

మెగా ఫ్యామిలీకి గుంటూరు భ‌యం ప‌ట్టుకుందా… ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి…!

సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా కొన్ని సెంటిమెంట్లు కొందరికి కలిసి వస్తాయి. మరికొందరికి బ్యాడ్‌ సెంటిమెంట్లుగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి మెగా ఫ్యామిలీని బాగా భయపెడుతూ వస్తోంది. ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో బాగా చర్చికి వస్తోంది. ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏదో కాదు.. మెగా ఫ్యామిలీకి గుంటూరు దర్శకులు కలిసి రావటం లేదు.

గుంటూరు కి చెందిన చాలామంది స్టార్ డైరెక్టర్లుగా టాలీవుడ్ లో ఉన్నారు. వీరు మిగిలిన హీరోలకు సూపర్ డూపర్ హిట్లు ఇస్తున్నా.. మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేస్తే మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి. ఉదాహరణకు బోయపాటి శ్రీను బాలయ్యతో పాటు ఎంతో మంది హీరోలకు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. అదే బోయపాటి మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ తో `వినయ విధేయ రామ` సినిమా తీస్తే డిజాస్టర్ అయింది.

అదే గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన కొరటాల శివకు తొలి నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఐదో సినిమాగా చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ తో కలిసి `ఆచార్య` తీస్తే ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ఆచార్య దెబ్బకు అసలు చిరంజీవి పరువేపోయింది. అదే గుంటూరుకు చెందిన డైరెక్టర్ బాబి పవన్ కళ్యాణ్ తో `సర్దార్ గబ్బర్ సింగ్` సినిమా తెరకెక్కించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచింది.

అసలే గుంటూరు డైరెక్టర్లు మెగా ఫ్యామిలీకి కలిసి రావటం లేదు అనుకుంటే ఇప్పుడు అదే బాబి చిరంజీవితో `వాల్తేరు వీరయ్య` సినిమా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లో154వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై కూడా ఇండస్ట్రీ వర్గాల్లో పెద్దగా అంచనాలు లేవు. దీనికి తోడు బాబి తనకు చెప్పిన కథ ఒకటి, తీస్తున్న సినిమా మరొకటి కావడంతో చిరు అసహనంతో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనికి తోడు ఈ గుంటూరు సెంటిమెంట్ భయం కూడా చేరువై బాబి వాల్తేరు వీరయ్యను వెంటాడుతోంది. మరి వాల్తేరు వీరయ్య మెగా ఫ్యామిలీకి గుంటూరు దర్శకులు కలిసి రారు అన్న బ్యాడ్ సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news