గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు జోరుగా చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు బలపరిచే విధంగా ఈ ఇద్దరు హైదరాబాదులోని ఓ గణేషుడి మండపంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో వీరి రహస్య బంధం బయటపడింది. దీనికి తోడు మనోజ్ కూడా త్వరలోనే మంచి రోజు చూసి అసలు విషయం చెప్తానని అనడంతో మనోజ్, మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారు.. అన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న మనోజ్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు అవుతుండడంతో.. టాలీవుడ్ జనాలు కూడా ముందుగానే మనోజ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే వీళ్ళిద్దరి సీక్రెట్ బంధానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మంచు ఫ్యామిలీకి, భూమా ఫ్యామిలీకి ఎప్పటినుంచో సంబంధాలు ఉన్నాయని.. మౌనిక రెడ్డికి పెళ్లి కావడానికి ముందు నుంచే మనోజ్ తో రిలేషన్ లో ఉందని … అయితే ఇదేం తప్పు కాదు అని కూడా ఆయన చెప్పటం విశేషం.
చాలామంది పెళ్లయిన వాళ్లు విడిపోతూ ఉంటారని మళ్ళీ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరుగుతుందని.. అలాగే భూమా మౌనిక, మనోజ్ మధ్య కూడా ఎప్పటినుంచో రిలేషన్ ఉంది. ఒకానొక సమయంలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వీళ్ల పెళ్లికి ఒప్పుకోలేదని ప్రకాష్ రావు చెప్పారు. ఆ తర్వాత మౌనిక రెడ్డికి చిత్తూరు జిల్లాకు చెందిన గణేష్ రెడ్డితో పెళ్లి చేశారని.. ఒక కొడుకు పుట్టాక మౌనిక తన భర్తకు విడాకులు ఇచ్చిందని, గత రెండేళ్లుగా మనోజ్‌తో ఆమె సహజీవనం చేస్తుందని ఆయన చెప్పారు.
మౌనిక,మనోజ్ ఇద్దరు సహజీవనం చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే అని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కర్నూలు, ఆళ్లగడ్డ, హైదరాబాదులో చాలామందికి ఈ విషయం తెలుసని ప్రకాష్ రావు తెలిపారు. కొద్ది రోజుల వరకు మనోజ్, మౌనిక ఇద్దరు చెన్నైలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశారని ఇప్పుడే వాళ్ళు హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారని,,, మనోజ్ కూడా మౌనికను పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులను కూడా ఒప్పించారని ఆయన అన్నారు.
మౌనికను పెళ్లి చేసుకునేందుకు మనోజ్ తల్లిదండ్రులను ఒప్పించడంతో త్వరలోనే వీరు పెళ్లి చేసుకోవడం ఖాయం అని ప్రకాష్ రావు చెప్పారు. ఇక మనోజ్, మౌనిక రెడ్డి ఇద్దరు 2017 లో వేరువేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. మనోజ్, ప్రణతి రెడ్డిని వివాహం చేసుకుంటే మౌనిక రెడ్డి, గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మౌనిక రెడ్డి పెళ్లికి మంచు మనోజ్ హాజరై సందడి చేస్తూ వారి పెళ్లిలో కనిపించారు. దీనిని బట్టి మనోజ్, మౌనిక రెడ్డి మధ్య పెళ్లికి ముందే రిలేషన్ ఉందన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.