Moviesమౌనిక‌రెడ్డితో మంచు మ‌నోజ్ రెండో పెళ్లిలో ఇంత ట్విస్టా... ఇద్ద‌రికి ఇది...

మౌనిక‌రెడ్డితో మంచు మ‌నోజ్ రెండో పెళ్లిలో ఇంత ట్విస్టా… ఇద్ద‌రికి ఇది రెండో పెళ్లే…!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారన్న వార్తలు గత రెండు రోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్, మంచు మోహన్ బాబు రెండో వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మంచు మనోజ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గత కొద్ది రోజులుగా సినిమాలుకు దూరంగా ఉన్న మనోజ్ త్వరలోనే అహం బ్రహ్మసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మనోజ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 2015లో తాను ప్రేమించిన ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

మనోజ్ వదిన అయిన‌.. మంచు విష్ణు భార్య వెరోనికా రెడ్డి స్నేహితురాలే ప్రణతి రెడ్డి. వెరోనికా కోసం ప్ర‌ణ‌తి వాళ్ల ఇంటికి వ‌స్తోన్న క్ర‌మంలోనే ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో ప్ర‌ణ‌తిని మనోజ్ ప్రేమించాడు. 2015లో ఈ జంట పెళ్లి జరగకగా నాలుగేళ్ల తర్వాత.. 2019లో వీరి మధ్య మనస్పర్ధల నేపథ్యంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రణతి రెడ్డి అమెరికా వెళ్లిపోయింది. భార్యతో విడాకులు తర్వాత మనోజ్ కెరీర్‌ పరంగాను ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు.

అప్పటి నుంచి సింగల్ గానే ఉంటున్న మనోజ్ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. దివంగత రాజకీయ నేతలు అయిన కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి – భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని మనోజ్ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి హైదరాబాదులోని సీతాఫల్‌మండిలోని వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడంతో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది.

మౌనిక అక్క అఖిల‌ప్రియ మాజీ మంత్రి అన్న సంగ‌తి తెలిసిందే. అఖిల‌కు కూడా ముందు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్ మేన‌మామ‌, ప్ర‌స్తుత క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి త‌న‌యుడితో వివాహం జ‌ర‌గ‌గా వారు విడిపోయారు. ఆ త‌ర్వాత అఖిల భార్గ‌వ్‌రామ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అఖిల రెండో భ‌ర్త భార్గ‌వ్ రామ్ మాజీ డీజీపీ నండూరి సాంబ‌శివ‌రావుకు మాజీ అల్లుడు.

ఇక మ‌నోజ్‌, మౌనిక రెడ్డి రెండో పెళ్లిలో మ‌రో ట్విస్ట్ ఏంటంటే… మౌనిక‌కు ఇప్ప‌టికే ఓ వ్య‌క్తితో వివాహం జ‌ర‌గ‌గా.. వారి మ‌ధ్య కూడా గ్యాప్ రావ‌డంతో విడాకులు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటే ఇది ఇద్ద‌రికి కూడా రెండో పెళ్లి అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news