MoviesBigg Boss 6: క‌న్నీళ్లు తెప్పిస్తోన్న‌ ఆరోహి కాస్టింగ్ కౌచ్ బాధ‌లు...

Bigg Boss 6: క‌న్నీళ్లు తెప్పిస్తోన్న‌ ఆరోహి కాస్టింగ్ కౌచ్ బాధ‌లు ..!

తెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్‌బాస్‌కు తిరుగులేని క్రేజ్ వ‌స్తోంది. ఫ‌స్ట్ సీజ‌న్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌డంతోనే ఈ షో జ‌నాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షోకు అదిరిపోయే రేటింగ్స్ వ‌చ్చాయి. ఆ త‌ర్వాత రెండో సీజ‌న్‌ను నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ చేయ‌గా అది కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత అన్ని సీజ‌న్ల‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక తాజాగా బిగ్‌బాస్ 6వ సీజ‌న్ స్టార్ట్ అయ్యింది. ఆదివారం చాలా గ్రాండ్‌గా ఈ సీజ‌న్ స్టార్ట్ అయ్యింది. ఈ సారి ఏకంగా రికార్డు స్థాయిలో 21 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే తొలి రోజే హౌస్‌లో రొమాన్స్‌తో స్టార్ట్ చేశారు. అర్జున్ క‌ళ్యాణ్ హౌస్‌లోకి డ్యాన్స్ చేసుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు. వెంట‌నే నాగార్జున ఓ చాక్లెట్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న వాళ్ల‌తో ఒక‌రితో ఆ చాక్లెట్ షేర్ చేసుకోవాల‌ని.. ఇద్ద‌రూ ఒకేసారి కొర‌కాల‌న్న కండీష‌న్ పెట్టాడు.

చివ‌ర‌కు అర్జున్ శ్రీ స‌త్య ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆ టాస్క్ గురించి చెప్పాడు. ముందు ఆమె నో చెప్పినా త‌ర్వాత వెంట‌నే అత‌డితో క‌లిసి ఆ చాక్లెట్ కొరుక్కుని తినేసింది. ఇక హౌస్‌లోకి వరంగల్‌కు చెందిన అరోహి రావ్‌ అలియాస్‌ అంజలి హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే తాను చిన్న‌ప్ప‌టి నుంచి ప‌డిన క‌ష్టాలు ఏక‌రువు పెట్టింది. తాను చిన్న‌ప్ప‌టి నుంచి కూడా క‌ష్టాలే కేరాఫ్‌గా పెరిగాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

అనారోగ్యంతో త‌ల్లి చనిపోతే.. తన తండ్రి మ‌రో మ‌హిళ‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడ‌ని.. దీంతో తాను అమ్మ‌మ్మ ద‌గ్గ‌రే పెరిగాన‌ని చెప్పింది. ఇక యాంక‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసి అరోహి షార్ట్ ఫిల్మ్‌తో తాను మంచి గుర్తింపు పొందాన‌ని చెప్పింది. అలాగే తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ వేధింపుల గురించి కూడా ఆమె చెప్పింది. ఎవ‌రిని అయినా సాయం చేయ‌మ‌ని అడిగితే.. నాకేంటి అంటూ వెకిలి చూపులు చూసేవార‌ని వాపోయింది.

ఇక అరోహి రావ్ ఇటు యాంక‌ర్‌గా, షార్ట్ ఫిల్మ్స్‌తో మాత్ర‌మే కాకుండా… ఇస్మార్ట్ న్యూస్‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. మ‌రి ఈ చ‌లాకీ చిన్న‌ది బిగ్ బాస్ హౌస్‌లో ఎలా అల‌రిస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news