తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు.. హీరోలకు మధ్య అవినాభ సంబంధం ఎక్కువ. గతం నుంచి ఇ ప్పటి వరకు కూడా హీరోలను అభిమానించే దర్శకులు..దర్శకులను గురువులుగా చూసుకునే హీరోలు ఉ న్నారు. ఇలానే.. చాలా మంది దర్శకులతో ఎన్టీఆర్‌కు అవినాభావ సంబంధం ఉంది. ఒక్క తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ చిత్ర సీమలోనూ.. అన్నగారికిప్రాణం పెట్టే దర్శకులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో కమలాకర కామేశ్వరరావు ఒకరు.
అన్నగారితో పలు పౌరాణిక, జానపద చిత్రాలను రూపొందించిన కమలాకర కామేశ్వరరావుతో.. అన్నగారికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన కాంబినేషన్‌లో వచ్చిన అనేక చిత్రాలు ఏళ్ల తరబడి ఆడాయి. అంతేకాదు.. కథ, కథనంలోనూ.. అన్నగారితో కామేశ్వరరావు చర్చించేవారు. ప్రతి విషయంలోనూ.. చర్చలు జరిపిన తర్వాత.. సెట్స్ మీదకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే కామేశ్వరరావుకు అన్నగారికి ఒక సెంటిమెంటు అయిపోయారు. కామేశ్వరరావు ఏ సినిమా ప్రారంభించినా.. దాదాపు అన్నగారికి ప్రాదాన్యం ఉంది.
ఈ క్రమంలో ఆయా సినిమాల షూటింగును ప్రారంభించేప్పుడు.. ఖచ్చితంగా అన్నగారితో కొబ్బరి కాయ కొట్టించేవారు. ఇలానే నర్తనశాల.. సినిమా విషయంలో అన్నగారు రావడం ఆలస్యమైంది. వాస్తవానికి అందరికన్నా ముందే ఉండే.. ఆయన.. ఆ సారి మాత్రం లేటైంది. మరోవైపు.. నిర్మాణ సంస్థ.. ముహూర్తంపై టెన్షన్ పడుతున్న పరిస్థితి. ముహూర్తం మించిపోతోందని..హీరోయిన్ సావిత్రితో అయినా.. కొబ్బరికాయ కొట్టించాలని.. కోరారు.
కానీ, కమలాకర కామేశ్వరరావు మాత్రం తిరస్కరించారు.“రామారావ్ ఎప్పుడు వస్తే.. అప్పుడే.. ఎప్పుడు కొబ్బరికాయ కొడితే.. అప్పుడే..ముహూర్తం“ అని తేల్చి చెప్పారట. ఆ తర్వాత. కొద్దిసేపటికి అన్నగారు రావడం.. తొలిషాట్ తీయడం అయిపోయాయి. ఈ సినిమా ఏకంగా మూడు సంవత్సరాలు నిర్విరామంగా ఆడి.. నిర్మాతలకు కాసుల పంట పండించింది.