టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో కృష్ణంరాజుది ఐదు దశాబ్దాల అనుబంధం. కెరీర్ ప్రారంభంలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు ఆ తర్వాత హీరో అయ్యాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఐదు దశాబ్దాల కెరీర్లో దాదాపు 180కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు ఆజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు వర్గాలు.. గ్రూపులు ఏనాడు లేవు. పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు అందరితోనూ కలిసిపోయేవారు.
ఆయన నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు కుమారుడు ప్రభాస్. తన పెదనాన్న వారసత్వాన్ని నిలబెడుతూ యంగ్ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు ఈరోజు భారతదేశం మెచ్చిన గొప్ప హీరో అయిపోయాడు. ఇదిలా ఉంటే ఇతరులతో స్నేహం విషయంలో కానీ.. ప్రేమ, ఆప్యాయతలు చూపే విషయంలో తన పెదనాన్న గుణాన్నే పుణిలికి పుచ్చుకున్నాడు ప్రభాస్. ముఖ్యంగా వీరు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన క్షత్రియలు కావడంతో వీరి కుటుంబంలో చిన్నప్పటి నుంచి బంధువులు, స్నేహితులకు మర్యాదల విషయంలో అస్సలు రాజీ పడే వారే కాదట.
విచిత్రం ఏంటంటే కృష్ణంరాజు తర్వాత ఈ తరంలోనూ ప్రభాస్ మర్యాదలు అంతే గొప్పగా ఉంటాయి.
ఒకసారి మలేషియాలో ప్రభాస్ బిల్లా.. ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లు ఒకే సమయంలో జరుగుతున్నాయి. అప్పుడు ఎన్టీఆర్ అక్కడే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న ప్రభాస్ ఎన్టీఆర్‌ను తమ షూటింగ్ ప్రాంతానికి ఆహ్వానించి మంచి విందు ఇచ్చారట. గోదావరి పులసలు, తాపేశ్వరం కాజాలు ఇలా చెప్పుకుంటే పోతే మొత్తం ఆంధ్ర వంటకాలు అన్ని ఎన్టీఆర్‌కు రుచి చూపించారు అట. అసలు అక్కడ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రత్యేకంగా ఆంధ్రా వంటకాల కోసం ఓ కుక్ మాస్టర్‌ను కూడా తీసుకు వెళ్లారట.
అక్కడున్న ఆహార పదార్థాలు చూసేసరికే ఎన్టీఆర్ కు కడుపు నిండిపోయిందట. బాబు ఇక్కడ కూడా మీ బాబు.. కొడుకులు మర్యాదలు చేసి చంపేస్తారా ? అని ఎన్టీఆర్ మెచ్చుకున్నారట. ఈ విషయాన్ని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ప్రభాస్‌కు తన సినిమాల్లో నటించే హీరోయిన్లు అందరికీ అదిరిపోయే విందు ఇవ్వడం అలవాటు. అనుష్క – శ్రద్ధా కపూర్ – రాధేశ్యామ్‌లో ప్రభాస్ తల్లిగా నటించిన సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ సైతం ప్రభాస్ తమకు అదిరిపోయే గొప్ప విందు ఇచ్చారంటూ.. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.